తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

Published : Oct 19, 2018, 05:29 PM IST
తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

సారాంశం

మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న మహర్షి చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

హైదరాబాద్: వివాదాలకు దూరంగా ఉండే ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. సాధారణంగా ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటున్నారు. తన ఆలోచనలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 

తన సినిమాల గురించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుండడమే కాకుండా ఇతర హీరోలపై, చిత్రాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దాంతో అతి తక్కువ సమయంలోనే ఆయన ట్విట్టర్ ఖాతాలో 70 లక్షల మంది చేరిపోయారు. 

తాజాగా ఆయన తన అబిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై కన్నడ అభిమానులు పైరయ్యారు. 

 

అన్ని భాషలకు సమానమైన ప్రాముఖ్యం ఇవ్వాలని, ఎక్కువ అభిమానులున్న కన్నడ భాషకు కూడా గౌరవం ఇవ్వాలని వారు మహేష్ బాబుకు సూచించారు. దాంతో పొరపాటును గుర్తించిన మహేష్ బాబు కన్న భాషను కూడా చేరుస్తూ మరోసారి ట్వీట్ చేశారు. 

మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న మహర్షి చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?