గుంటూరు కారం సెకండ్ సింగిల్.. థమన్ ను రెచ్చగొడుతున్న ఫ్యాన్స్.!

Published : Dec 10, 2023, 10:29 AM ISTUpdated : Dec 10, 2023, 10:38 AM IST
గుంటూరు కారం సెకండ్ సింగిల్.. థమన్ ను రెచ్చగొడుతున్న ఫ్యాన్స్.!

సారాంశం

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ (Thaman S) ‘గుంటూరు కారం’కు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. సెకండ్ సింగిల్ రాబోతున్న సమయంలో ఫ్యాన్స్ థమన్ ను ఆ రేంజ్ మ్యూజిక్ కావాలని కోరుతున్నారు. 

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రస్తుతం భారీప్రాజెక్ట్స్ సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. టాలీవుడ్ లో టాప్ మ్యూజిషియన్ అయినా.. థమన్ కు తన ప్రతి సినిమాకూ అభిమానుల నుంచి కొన్ని ఎక్స్ పర్టేషన్స్  తప్పడం లేదు. ఓ వైపు ట్రోల్ ఉన్నా.. వాటిని తన మ్యూజిక్ తో తుడిచేస్తున్నారు. కానీ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)కు అందిస్తున్న మ్యూజిక్ పై అంచనాలు ఏర్పడ్డాయి. 

ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ‘Dum Masala Biryani)  సాంగ్ ను విడుదల చేసి మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా రెండో పాటపై అప్డేట్ అందించారు.  `ఓ మై బేబీ` (Oh My Baby) అంటూ సాగే రెండో పాటని విడుదల చేయబోతున్నట్టు నిన్న ప్రకటించారు. ఆ పాటు ఈ నెల 11న (రేపు) సాయంత్రం నాలుగు గంటలకు ఈ పాట ప్రోమోని విడుదల చేస్తామని, 13న పూర్తి పాటని విడుదల చేస్తామని యూనిట్ తెలిపింది. 

ఈ సందర్భంగా థమన్ నుంచి ‘అతడు’ తరహా సంగీతం కావాలంటూ... కోరుతున్నారు. థమన్ కు ఆ సాంగ్స్ ను ట్యాగ్ చేస్తూ మరీ అడుగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇక రేపు ప్రోమో వచ్చాక అభిమానులు ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలంటున్నారు. ఫ్యాన్స్ అంచనాలను రీచ్ అయ్యేలా థమన్ సంగీతం ఇవ్వబోతున్నాడని హైప్ నెలకొంది. పోస్టర్ ప్రోమోపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ వరకు మరో రెండు సాంగ్స్ ను కూడా విడుదల చేయబోతున్నారు. 

మహేశ్ బాబు (Mahesh Babu)   - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి భారీ అంచనాలు ఉన్నాయి. మార్కెట్ లోనూ డిమాండ్ ఉంది. ఈ సినిమాను హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా, క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12, 2024న విడుదల కాబోతోంది. 

PREV
click me!

Recommended Stories

Jailer 2 Collection Day 3: 75 ఏళ్ల వయసులో.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న రజినీకాంత్, జైలర్ 2 ప్రభంజనం, 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
Ranabaali Collection: విజయ్ దేవరకొండకు షాక్, రెండోవరోజు తగ్గిన రణబాలి కలెక్షన్స్, వీకెండ్ కలిసొస్తుందా?