
ప్రముఖ హీరో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార చిత్రం ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని నిర్వహించారు. ఈ వేడుకకు కల్యాణ్ రామ్ సోదరుడు, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు భారీగా నందమూరి అభిమానులు హాజరయ్యారు. అయితే బింబిసార ఈవెంట్‌కు హాజరైన ఓ అభిమాని అనుమానస్పద స్థితిలో మృతిచెందినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పలు తెలుగు న్యూస్ చానల్స్ రిపోర్టు చేశాయి.
మృతిచెందిన అభిమానిని పుట్టా సాయిరామ్ గుర్తించారు. అతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం.పుట్టా సాయిరామ్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నిన్న జరిగిన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. సాయిరామ్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి పోలీసులు విచారణ చేపడుతున్నారు.