ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆగని విషాదాలు, ప్రముఖ హాలీవుడ్ నటుడు ముర్రే కన్నుమూత..

By Mahesh JujjuriFirst Published Feb 3, 2024, 2:45 PM IST
Highlights

ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదాలు ఆగడం లేదు.. వరుసగా ఎవరో ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. భాషతో సబంధం లేకుండా వరుసగా ఫిల్మ్ స్టార్స్ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. 


ఫిల్మ్ ఇండస్ట్రీని విషాదాలు వదలడంలేదు. పరిశ్రమకు చెందినప్రముఖులతో పాటు.. కొంత మంది స్టార్స్ ఇంట విషాదాలుచోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. హాలీవుడ్ , బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా.. అన్ని ఇండస్ట్రీలలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్ గా ఇళయరాజా కూతురు ప్రముఖ సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ భవతారిణి క్యాన్సర్ తో మరణించగా.. ఆమధ్య నిర్మాత ఎస్ కె ఎన్ తండ్రి, హీరో వేణు తండ్రిగారు కూడా మరణించారు. ఇక లాస్ట్ ఇయర్ మరణించినంతగా సినిమా వాళ్లు ఏ ఏడాది మరణించలేదు. 

ఇక తాజగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు ముర్రే కన్నుమూశారు.   హాలీవుడ్ లో ఆయన చేసిన సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆయన చేసిన సినిమాల్లో నాట్స్ ల్యాండింగ్, బస్ స్టాప్,  సినిమాలు ఎంతో పేరు తెచ్చుకున్నాయి. ముర్రే అంటే చాలా మందికి తెలియదు కాని.. డాన్ ముర్రే (Don Murray) అంటే మాత్రం అందరికి గుర్తుకు వస్తుంది. ఇక ప్రస్తుతం ముర్రే వయన్సు  94 ఏళ్లు. 

Latest Videos

వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న  డాన్ ముర్రే అనారోగ్యంతో మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు వెల్ల‌డించారు. ఇక డాన్ ముర్రే మరణ వార్తతో హాలీవుడ్  ఇండ‌స్ట్రీలో విషాదం అలుముకుంది. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అంతే కాదు ఆయన  అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

హాలీవుడ్ ల్లో మల్టీ టాలెంటెడ్ గా  ముర్రేకు పేరుంది. హీరోగా నటిస్తూనే రచయితగా.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించి.. హాలీవుడ్ రంగంలో త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్నాడు డాన్ మర్రే. ఆయన చేసిన సినిమాల్లో  బ్యాచిలర్ పార్టీ, ది హుడ్లమ్ ప్రీస్ట్ . ది స్కిన్ ఆఫ్ అవర్ టీత్ ,  వన్ ఫుట్ ఇన్ హెల్ ,  ఎ హాట్‌ఫుల్ ఆఫ్ రెయిన్ , షేక్ హ్యాండ్స్ విత్ ది డెవిల్ ఇలా దాదాపు 35 సినిమాలకు పైగా చేశారు ముర్రె. 

బస్ స్టాప్ సినిమా ముర్రె కెరీర్ లోనే మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాదు ఈసినిమాతో  ఆస్కార్ సాధించాడు డాన్ ముర్రే.. 1929 జూలై 31న లాస్ ఏంజెల్స్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు డొనాల్డ్ పాట్రిక్ ముర్రే. చాలా చిన్నవయస్సులో ఇండస్ట్రీలోకి వచ్చిన ముర్రే మొదటి సినిమా  1951లో తెరకెక్కిన ది రోజ్ టాటూ. ఈ సినిమాలో న‌ట‌న‌కు గాను ముర్రే ఆస్కార్‌కు కూడా నామినేట్ అయ్యాడు. ఒకప్పటి హాలీవుడ్ స్టార్ నటి మార్లిన్ మన్రో ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది.

click me!