‘బాహుబలి’ సినిమా ప్రారంభంలో స్త్రీ పాత్రలను బలంగా చూపించినా, చివరకు శృంగార బొమ్మలా చూపించే ప్రయత్నం చేశారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా, కీడు కలిగించే అవకాశం ఉందని వెల్లడించింది.
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన సూపర్‌హిట్ మూవీ 'యానిమల్' ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సినిమా రీసెంట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యాక మరింతగా సందీప్ పై సోషల్ మీడియాలో దాడి మొదలైంది. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూసారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. జనవరి 26 నుంచి యానిమల్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పటికే ఇలాంటి చిత్రాల వల్ల సమాజానికి తీవ్రస్థాయిలో ముప్పు తప్పదని మహిళా ఎంపీలు అభిప్రాయపడ్డారు. స్త్రీ విద్వేష సినిమాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
‘యానిమల్’ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు స్పందించారు. ఈ సినిమా స్త్రీ విద్వేషంతో నిండి ఉందని వెల్లడించింది. ‘బాహుబలి-2’, ‘కబీర్ సింగ్’ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. ‘బాహుబలి’ సినిమా ప్రారంభంలో స్త్రీ పాత్రలను బలంగా చూపించినా, చివరకు శృంగార బొమ్మలా చూపించే ప్రయత్నం చేశారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా, కీడు కలిగించే అవకాశం ఉందని వెల్లడించింది.
దీనికి కౌంటర్ గా సందీప్ మాట్లాడుతూ...“నా సినిమాల గురించి విమర్శించే ఆమెను ఓ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ముందుగా అమీర్ ఖాన్ నటించిన ‘దిల్’ సినిమా చూడండి. ఈ సినిమాలో ఆయన దాదాపు అమ్మాయిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆ అమ్మాయిదే తప్పు అనేలా చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ, అదే అమ్మాయి చివరకు అతడితో ప్రేమలో పడుతుంది. ఈ సినిమాను ఎలా అర్థం చేసుకోవాలి? ముందు ఇలాంటి సినిమాల గురించి మాట్లాడిన తర్వాత మా సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. గతాన్ని మరిచి విమర్శలు చేయడం మంచిది కాదని గుర్తుంచుకుంటే బాగుంటుంది” అని సందీప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మించారు. టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది. మితిమీరిన రక్తపాతం, అసభ్యకరమైన కొన్ని హావభావాలు, వినలేని డైలాగులు ఇబ్బంది పెడతాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే యూత్ కు పిచ్చ పిచ్చగా ఎక్కేసింది.