'వినయ విధేయ రామ' ఫస్ట్ సాంగ్ రాబోతుంది!

Published : Dec 01, 2018, 01:57 PM IST
'వినయ విధేయ రామ' ఫస్ట్ సాంగ్ రాబోతుంది!

సారాంశం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టైటిల్ క్లాస్ గా ఉన్నా.. టీజర్ మాత్రం చాలా మాసీగా ఉంది. అయితే సినిమాలో ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా బాగా ఉంటుందని ఇప్పుడు ఆ కోణాన్ని తెలియజేసే విధంగా సినిమాలో ఒక పాటను విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాలో ఫ్యామిలీ సాంగ్ ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిసంబర్ 3 సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకు 'తందానే తందానే' అనే పాటను విడుదల చేయనున్నారు.

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల  చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?
వారణాసి లో మహేష్ బాబు తండ్రి పాత్రను మిస్సైన ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?