హీరోతో హీరోయిన్ బ్రేకప్.. ఫ్యామిలీ హ్యాపీ!

Published : Jul 10, 2018, 10:44 AM IST
హీరోతో హీరోయిన్ బ్రేకప్.. ఫ్యామిలీ హ్యాపీ!

సారాంశం

నిజానికి వీరిద్దరూ ఎప్పటినుండో రిలేషన్ లో ఉన్నారు. తను ఏం సినిమా చేయలన్నా.. ఫ్యామిలీ కంటే ఈ హీరో గారి మాట ఎక్కువగా వినడం. అతడు ఆమెను కంట్రోల్ చేయడం వంటివి జరుగుతున్నాయట

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ స్టోరీలు చాలా కామన్. బాలీవుడ్ తో పోలిస్తే సౌత్ లో లవ్ ఎఫైర్స్ కాస్త తక్కువగానే కనిపిస్తాయి. కొందరు హీరోయిన్లు తమ కెరీర్ ను, వ్యక్తిగత జీవితాన్ని బాగానే మ్యానేజ్ చేసుకుంటారు. తమ ప్రేమ కారణంగా కెరీర్ కు ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటారు. అయితే ఓ యంగ్ హీరోయిన్ మాత్రం ఏ సినిమాలు చేయాలనే విషయంలో తన బాయ్ ఫ్రెండ్ మాట ఎక్కువగా వినడంతో చాలా అవకాశాలు పోగొట్టుకుందని టాక్. ఇప్పుడు తన కెరీర్ ను సెట్ చేసుకోవడం కోసం ఇప్పుడు తన ప్రేమకు గుడ్ బై చెప్పబోతుందని సమాచారం. 

అసలు విషయంలోకి వస్తే.. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబానికి చెందిన ఓ యంగ్ హీరోయిన్ తనతో కలిసి పని చేసిన ఓ హీరోతో ప్రేమలో పడింది. ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. కానీ ఈ జంట మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కవర్ చేస్తూ వస్తున్నారు. నిజానికి వీరిద్దరూ ఎప్పటినుండో రిలేషన్ లో ఉన్నారు. తను ఏం సినిమా చేయలన్నా.. ఫ్యామిలీ కంటే ఈ హీరో గారి మాట ఎక్కువగా వినడం. అతడు ఆమెను కంట్రోల్ చేయడం వంటివి జరుగుతున్నాయట. కొన్నాళ్ల పాటు అతడి ప్రవర్తన ఆమెకు బాగానే అనిపించింది.

కానీ ఈ మధ్యకాలంలో అతడు డామినేట్ చేస్తున్నాడనే ఫీలింగ్ ఆమెకు ఎప్పుడైతే కలిగిందో ఇక తన ప్రేమకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుందట. ఈ బ్రేకప్ పట్ల సదరు  హీరోయిన్ ఫ్యామిలీ సంతోషంగా ఉందని తెలుస్తోంది. చిన్న వయసులోనే ప్రేమ కరెక్ట్ కాదని తెలిసినప్పటికీ ఆమె ఇష్టపడడంతో ఫ్యామిలీ కూడా ఏం అనలేకపోయింది. కానీ ఇప్పుడు ఆమె అతడి నుండి విడిపోతుండడంతో ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీ అని టాక్. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?