సుజాత.. ఈ ఫేక్‌ నవ్వు ఆపు చూడలేక చచ్చిపోతున్నాం.. నెటిజన్ల ట్రోలింగ్‌

Published : Oct 04, 2020, 08:14 PM IST
సుజాత.. ఈ ఫేక్‌ నవ్వు ఆపు చూడలేక చచ్చిపోతున్నాం.. నెటిజన్ల ట్రోలింగ్‌

సారాంశం

యాంకర్ `జోర్దార్‌` సుజాత బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్‌గా ఎంపికయ్యారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంటోంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా, ఆమె `అతి` పనులు ఇప్పుడు ఇతర కంటెస్టెంట్లనే కాదు, ఆడియెన్స్ ని విసుగు తెప్పిస్తుందట. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఓవరాల్‌గా చూస్తే అంత రంజుగా సాగడం లేదనే కామెంట్‌ సోషల్‌ మీడియా నుంచి, టెలివిజన్‌ ప్రియుల నుంచి వినిపిస్తుంది. చాలా సార్లు షోనే బోర్‌ కొడుతుందంటే, మధ్యలో కంటెస్టెంట్‌ సుజాత మరింత చిరాకు తెప్పిస్తుందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బిగ్‌బాస్‌ 4లో ఓ ప్రముఖ టీవీ న్యూస్‌ ఛానెల్‌నుంచి యాంకర్ `జోర్దార్‌` సుజాత కంటెస్టెంట్‌గా ఎంపికయ్యారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంటోంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా, ఆమె `అతి` పనులు ఇప్పుడు ఇతర కంటెస్టెంట్లనే కాదు, ఆడియెన్స్ ని విసుగు తెప్పిస్తుందట. ముఖ్యంగా ఆమె నవ్వు విషయంలో అనేక విమర్శలు, కామెంట్స్ వస్తున్నాయి. 

ఫేక్‌ నవ్వు అంటూ దుమ్మెత్తిపోతున్నారు. చీటికి మాటికి నవ్వడంతో ఎందుకునవ్వుతుందో అర్థం కాదని నాగార్జునే అన్నాడు. అయితే వచ్చిన మొదట్లో నాగ్‌ని బిట్టూ అని పిలిచి ఆకట్టుకున్నా, అదే పనిగా పిలవడం మాత్రం చాలా ఓవర్‌ యాక్షన్‌గా ఉందంటున్నారు. ఒకటి రెండు సార్లు అంటే ఏమోగానీ, ఓ పెద్ద స్టార్‌ని పట్టుకుని ప్రతి సారి బిట్టూ అని పిలవడం నాగ్‌కి కూడా ఇబ్బందికరంగా మారింది. పైకి చెప్పకపోయినా లోలోపల ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారని టాక్‌. కనీసం గౌరవం ఇవ్వాలని నాగ్‌ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ముఖ్యంగా నవ్వు విషయంలోనే బాగా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు హౌజ్‌లో అప్పుడే నవ్వడం, అప్పుడే ఏడవడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్‌ చేయడం అంతుచిక్కడం లేదు. ఫేక్‌ నవ్వు ఆపమని, చూడలేక చచ్చిపోతున్నామని కామెంట్‌ చేస్తున్నారు. మరోవైపు మానసికంగా తానేమైనా ఒత్తిడికి గురవుతుందా? అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సుజాతపై మీమ్స్ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతుండటం విశేషం.  సుజాత  ఎప్పుడెప్పుడు ఎలిమినేట్‌ అవుతుందని కోరుకుంటున్నామని అంటున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్