స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం తన ప్రాజెక్ట్స్ తో ఫుల్ బీజీగా ఉన్నారు. మరోవైపు తన ఆరోగ్యంపైనా శ్రద్ధ వహిస్తున్నారు. ఇందుకు తగిన సమయం కేటాయిస్తూ ఆధ్యాత్మిక బాటలోనూ పయనిస్తున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. చైతూతో విడాకుల తర్వాత సామ్ సినిమాలపైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయితే సమంత కొద్దిరోజులుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడ్డ విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స తర్వాత కాస్తా కోలుకుంది. మొన్నటి వరకు ఇంట్లోనూ ట్రీట్ మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కొద్దికొద్దిగా కోలుకుంటున్న సామ్ ఇటు తన ప్రాజెక్ట్స్ పైనా ఫోకస్ పెడుతున్నారు. హెవీ వర్కౌట్స్ చేస్తూ నెట్టింట పోస్టులు పెడుతూ ఆశ్చర్యపరుస్తోంది.
మరోవైపు మానసిక ప్రశాంతతకోసం ఆధ్యాత్మిక చింతనలోనూ పయనిస్తోంది. గతంలో ఇండియాలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా తన ఆరోగ్యం మెరుగుపడగానే తమిళనాడులో ఓ పుణ్యక్షేత్రంలో మొక్కులు చెల్లించిన విషయం తెలిసిందే. మానసిక ప్రశాంతత కోసం సమంత ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తుందని తెలుస్తోంది. తాజాగా తన ఇంటిలోని పూజ గదిలో అమ్మవారి విగ్రహానికి పూజలు చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది.
లేటెస్ట్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. పూజా గదిలో అమ్మవారి ప్రతిమ ముందు పద్మాసనంలో కూర్చొని దైవస్మరణ చేస్తున్నట్టుగా కనిపించింది. ఈ ఫొటోను షేర్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ గా నోట్ కూడా రాసుకొచ్చింది సామ్. నోట్ లో.. ‘కొన్నిసార్లు, ఇది మానవాతీత బలంగా తీసుకోలేం. విశ్వాసమే మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. విశ్వాసం మిమ్మల్ని ప్రశాంతంగానూ ఉంచుతుంది. విశ్వాసం మీ గురువుగా మరియు మీ స్నేహితునిగా మారుతుంది. విశ్వాసం మిమ్మల్ని మానవాతీతంగా చేస్తుంది.’ అని పేర్కొంది.
ప్రస్తుతం సామ్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్ సమంత పోస్టుకు రిప్లై ఇస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక కేరీర్ విషయానికొస్తే సమంత ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం క్రేజీ వెబ్ సిరీస్ ‘సిటడెట్’ ఇండియన్ వెర్షన్ లో షూటింగ్ లో ఉంది. త్వరలో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొనబోతోంది. ప్రస్తుతం సామ్ నటించిన ‘శాకుంతలం’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.