స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో జేడీ చక్రవర్తి 'దహిణి'.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!

Published : Nov 08, 2022, 07:10 PM ISTUpdated : Nov 08, 2022, 07:18 PM IST
స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో జేడీ చక్రవర్తి 'దహిణి'.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!

సారాంశం

టాలీవుడ్ సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి (JD Chakravathy) నటించిన హిందీ ఫిల్మ్ స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కానుంది. ఈ మేరకు అవార్డు కూడా లభించింది.   

తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దహిణి’ (Dahini). ఈ చిత్రానికి జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ తెరకెక్కించారు. ఆషిక్ హుస్సేన్, బద్రుల్ ఇస్లాం, అంగన రాయ్, రిజు బజాజ్, జగన్నాథ్ సేథ్, శృతి జయన్ దిలీప్ దాస్‌, దత్తాత్రేయ కీలక పాత్రల్లో నటించారు. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు.

వాస్తవ ఘటనలు ఆధారంగా తెరకెక్కించిన  ‘దహిణి’ చిత్రం స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక అయ్యింది. ఈ నెల 9 నుంచి వచ్చే నెల డిసెంబర్ 7 వరకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కొనసాగుతోంది. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో గౌరవం దక్కడం ఇది రెండోసారి. ఈ చిత్రానికి పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు లభించింది. 'విచ్ హంటింగ్' పేరుతో పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నంతో... వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ 'దహిణి' తెరకెక్కించారు. ఒడిశా మరియు హిందీ భాషాల్లో తెరకెక్కించారు.  

ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా 'దహిణి' చిత్రాన్ని రూపొందించారు. మన దేశంతో పాటు పలు దేశాలను పట్టి పీడిస్తున్న 'విచ్ హంటింగ్' సమస్యను వెలుగులోకి తీసుకు రావాలని...  మానవ హక్కుల ఆందోళన, లింగ ఆధారిత హింసను ప్రస్తావిస్తూ రాజేష్ టచ్ రివర్ ' దహిణి' సినిమాను రూపొందించడం విశేషం. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నౌషాద్ షెరీఫ్, ప్రొడక్షన్ డిజైనర్ గా సునీల్ బాబు, సౌండ్ డిజైనర్ గా అజిత్  అబ్రహం జార్జ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : జార్జ్ జోసెఫ్, ఎడిటర్ గా శశి కుమార్, డైలాగ్ రైటర్ గా రవి పున్నం, స్పెషల్ మేకప్ డిజైన్ ఆర్టిస్ట్ గా ఎన్.జి. రోషన్, డా. గోపాల్ శంకర్ మ్యూజిక్  అందించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌