Adipurush First Look: ప్రభాస్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చే న్యూస్... రాముడిగా వచేస్తున్నాడట!

Published : Aug 06, 2022, 06:06 PM IST
Adipurush First Look: ప్రభాస్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చే న్యూస్... రాముడిగా వచేస్తున్నాడట!

సారాంశం

ప్రభాస్ నుండి నెక్స్ట్ వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆదిపురుష్. మైథలాజికల్ మూవీగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో ప్రభాస్ రామునిగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పై భారీ హైప్ నెలకొని ఉంది. కాగా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఎప్పుడనే సమాచారం అందుతుంది.   

పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్(Prabhas) చేస్తున్నవన్నీ భారీ ప్రాజెక్ట్స్.  ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె నిర్మాణ దశలో ఉండగా మరి కొన్ని ప్రాజెక్ట్స్ ప్రకటించారు. వీటిలో ఆదిపురుష్ 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో అప్పుడే బిజినెస్ కూడా మొదలైపోయిందంటున్నారు. ఆదిపురుష్ డిజిటల్ రైట్స్ ఏకంగా రూ. 250 కోట్లకు అమ్ముడైనట్లు ఓ వార్త పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. వరల్డ్ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఆదిపురుష్ డిజిటల్ హక్కులను భారీగా చెల్లించి దక్కించుకుందట. 

మరి అంత ధర అంటే మూవీ బడ్జెట్ తో సగానికి పైగా వచ్చేసినట్లే. ఇక రామునిగా ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా లవర్ ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో రాముడు రోల్ కి సిల్వర్ స్క్రీన్ పై సపరేట్ ఇమేజ్ ఉంది. అంత హైప్ ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం.అయితే అందరి ఆతృతకు తెరపడే రోజు దగ్గర్లోనే ఉందంటున్నారు. సెప్టెంబర్ లో ఆదిపురుష్(Adipurush) నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేస్తారట. మరి ఇదే జరిగితే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. 

ఇక ఈ మూవీలో ప్రభాస్ ప్రత్యర్థి రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. దర్శకుడు ఓమ్ రౌత్ భారీగా తెరకెక్కిస్తున్నారు. చాలా కాలంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది ఈ చిత్రం. కాగా వచ్చే ఏడాది ప్రభాస్ నుండి రెండు చిత్రాలు రానున్నాయి. ఆదిపురుష్ తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ 2023లో విడుదల కానున్నాయి. వీటన్నింటినీ మించి భారీ ఎత్తున తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె విడుదలకు ఇంకా సమయం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ilaiyaraaja: మణిరత్నంను మెప్పించిన స్విమ్మింగ్ పూల్‌ సాంగ్ ఇలయరాజా చేసిన మ్యాజిక్ ఏంటంటే?
Korean Kanakaraju Collection: 2వ రోజు రచ్చ చేస్తోన్న కొరియన్ కనకరాజు, బాక్సాఫీస్ ఎంత కలెక్ట్ చేసిందంటే?