'పుష్ప' రాజ్ శత్రువు బన్వర్ సింగ్ షెకావత్...!

By team teluguFirst Published Aug 28, 2021, 10:58 AM IST
Highlights

పుష్ప చిత్రంలో విలన్ గా ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా నేడు ఆయన లుక్ విడుదల చేస్తూ పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. గుండుతో పోలీస్ అధికారిగా ఫహద్ లుక్ ఆసక్తి రేపుతోంది.

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో పుష్ప ఒకటి. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం పుష్ప కాగా, ఇద్దరికీ మొదటి పాన్ ఇండియా మూవీ. దీనితో దర్శకుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక పుష్ప రెండు పార్ట్స్ గా విడుదల కానుంది. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. 


ఇక పుష్ప చిత్రంలో విలన్ గా ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా నేడు ఆయన లుక్ విడుదల చేస్తూ పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. గుండుతో పోలీస్ అధికారిగా ఫహద్ లుక్ ఆసక్తి రేపుతోంది.  బన్వర్ సింగ్ షెకావత్ అనే ఫారెస్ట్ అధికారిగా ఫహద్ పుష్ప మూవీలో కనిపించనున్నారు. 


అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ రోల్ చేస్తుండగా, అతన్ని వెంటాడే డేంజరస్ పోలీస్ గా ఫహద్ పాత్ర తీరు ఉండే అవకాశం కలదు. మొత్తంగా విలన్ ఫస్ట్ పుష్ప పై అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇటీవలే పుష్ప నుండి మొదటి సాంగ్ విడుదల కావడంతో పాటు, అనేక యూట్యూబ్ రికార్డ్స్ నమోదు చేసింది. 


మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పుష్ప తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, హాట్ యాంకర్ అనసూయ ఓ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఇక సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ పుష్ప చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
 

Meet the 🔥

The most talented turns into menacing BHANWAR SINGH SHEKHAWAT (IPS) to lock horns with our 👊 🤙 pic.twitter.com/tskyU5cZ8a

— Mythri Movie Makers (@MythriOfficial)
click me!