Fact Check: లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో ఉమ్ము ఊసిన షారూక్..? నిజమెంత..?

Published : Feb 07, 2022, 10:36 AM IST
Fact Check: లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో ఉమ్ము ఊసిన షారూక్..? నిజమెంత..?

సారాంశం

లతా మంగేష్కర్ కి ప్రభుత్వ లాంఛనాలతో.. ముంబయిలోని శివాజీ పార్క్ లో  అంతర్యక్రియలు నిర్వహించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ, షారూక్ ఖాన్, క్రికెటర్ సచిన్ టెండుల్కర్ లాంటి ప్రముఖులు హాజరై.. ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు.  

క్వీన్ ఆఫ్ మెలోడీ, ప్రముఖ గాయని లతా మంగేష్కర్(92) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే.  గత నెలలో ఆమె కోవిడ్ బారిన పడగా.. చాలా రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే.. శ్వాస సమస్యలు, న్యూమోనియా కారణంగా.. ఆరోగ్యం క్షీణించి ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.  ఈ క్రమంలో.. ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు.

కాగా.. లతా మంగేష్కర్ కి ప్రభుత్వ లాంఛనాలతో.. ముంబయిలోని శివాజీ పార్క్ లో  అంతర్యక్రియలు నిర్వహించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ, షారూక్ ఖాన్, క్రికెటర్ సచిన్ టెండుల్కర్ లాంటి ప్రముఖులు హాజరై.. ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు.

అంత్యక్రియల సమయంలో షారూక్ ఖాన్ ది ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోలో  షారూక్.. లతా మంగేష్కర్ మృతదేహం పై ఉమ్మి వేస్తున్నట్లుగా కనిపించింది.  దీంతో.. నెటిజన్లు షారూక్ పై తీవ్రంగా మండిపడ్డారు. నెట్టింట ఈ ఫోటో తీవ్ర దుమారం రేపింది.  షారూక్ చాలా అసహ్యంగా ప్రవర్తించారంటూ తీవ్రంగా మండిపడ్డారు. అయితే..  షారూక్ ఉమ్మి వేయలేదని..  ఆయన బ్లో చేశారని చెబుతున్నారు.  ఇస్లాంలో.. అలా చేయడం వల్ల దుష్ట ఆత్మలు, దెయ్యాలు ఎవైనా ఉంటే దూరమౌతాయట. అందుకే అలా చేశాడని.. అది ఉమ్మివేయడం కాదని చెబుతున్నారు.

 

‘‘షారుఖ్ ఖాన్ దువా చదివి, తదుపరి జీవితంలో రక్షణ , ఆశీర్వాదం కోసం లతాజీ మృత దేహంపై ఊదారు. దానిని ఉమ్మివేయడమని అనరు’’అని షారూక్ చేసిన దానిపై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇస్లాం మతం ప్రకారం అలా చేయడం మంచిదని.. అందుకే చేశారని వివరణ ఇస్తున్నారు.

ఇస్లాంలో 'గాలి ఊదడం' సాధారణ ఆచారం అని ఒక నెటిజన్ వివరించాడు. "SRK అక్కడ ఉమ్మి వేయలేదు. అతను ఊదాడు, ఇది ఇస్లాంలో సాధారణ పద్ధతి. ముస్లింలు పవిత్ర ఖురాన్ నుండి ఆయత్‌లను చదివిన తర్వాత వారి నోటి నుండి గాలిని ఊదుతారు.’’ అని క్లారిటీ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం