
ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ వచ్చిన `ఎఫ్2` చిత్రం ఎంతటి పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. వెంకటేష్(Venkatesh), వరుణ్ తేజ్(Varun Tej) హీరోలుగా, తమన్నా(Tamannaah), మెహరీన్(Mehrenn) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం వంద కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. దీనికి సీక్వెల్‌గా `ఎఫ్3`(F# Movie) రూపొందుతుంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్‌లతోపాటు సోనాలీ చౌహాన్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి రూపొందిస్ఉతన్న మరో ఫన్ ఎంటర్‌టైనర్‌గా `ఎఫ్3` రాబోతుంది. డబ్బుతో కూడిన ఫ్రస్టేషన్, ఫన్ నేపథ్యంలో సాగే చిత్రమిది.
తాజాగా ఎఫ్ 3` ట్రైలర్ (F3 trailer) విడుదలైంది. నేడు సోమవారం(మే 9)న ఈ ట్రైలర్ ని విడుదల చేయగా, ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నవ్వులు పూయిస్తుంది. ఇందులో వెంకటేష్ రే చీకటితో బాధపడుతున్నట్టుగా, వరుణ్ తేజ్ నత్తితో బాధపడుతుంటారు. అయితే ఈ క్రమంలో వారు చెప్పే డైలాగులు, బిహేవియర్ ఆద్యంతం కామెడీని పంచుతుంది. అయితే ఇందులో చివరికి వెంకటేష్.. తన దగ్గుబాటి ఫ్యామిలీ అని, వరుణ్ తేజ్ తనది మెగా ఫ్యామిలీ అంటూ చెప్పుకోవడం విశేషం.
ప్రపంచానికి తెలిసిన పంచ భూతాలు ఐదు, కానీ ఆరో భూతం ఒకటి ఉంది, అదే డబ్బు. డబ్బున్న వాడికి ఫన్, లేని వాడికి ఫ్రస్టేషన్` అంటూ మురళీ శర్మ పాత్రలో చెప్పిన డైలాగ్‌తోనే సినిమా ఎలా సాగుతుందో అర్థమవుతుంది. చివరికి వెన్నెల కిషోర్‌తో పాన్ ఇండియా స్టార్స్ పై కూడా సెటైర్లు వేయించారు అనిల్ రావిపూడి. `ఈ హీరోలకు పాన్ ఇండియా జూ. ఆర్టిస్ట్ పవరేంటో చూపిస్తా` అని చెప్పడం, ఆయన్ని ఎద్దు గుద్దేయడం ఆద్యంతం నవ్విస్తుంది. కన్‌క్లూజన్‌గా `ఉన్నదెంతా అంటే ఎంత ఉంటే అంతా.. అని ప్రగతి చెప్పడం, దానికి ఫ్రస్టేట్ అయిన వెంకీ, వరుణ్ చైర్లు లేపి దాడి చేసేందుకు ప్రయత్నించడం` ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. సీక్వెల్‌లో ఫన్ డబుల్ డోస్ ఉందని అర్థమవుతుంది. ఈ చిత్రం మే 27న విడుదల కాబోతుంది. దిల్‌రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.