బాలీవుడ్ లో F2!

Published : Mar 29, 2019, 03:01 PM IST
బాలీవుడ్ లో F2!

సారాంశం

టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన F2 సినిమా దిల్ రాజుకు 80కోట్లకు పైగా లాభాలను అందించిన సంగతి తెలిసిందే. కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చూపించాలని దిల్ రాజు సిద్దమవుతున్నాడు

టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన F2 సినిమా దిల్ రాజుకు 80కోట్లకు పైగా లాభాలను అందించిన సంగతి తెలిసిందే. కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చూపించాలని దిల్ రాజు సిద్దమవుతున్నాడు. బోణి కపూర్ సహాయంతో స్టార్ సెలబ్రేటిస్ ను సెలెక్ట్ చేసుకొని సినిమాను తెరకెక్కించాలని ప్లాన్స్ జరుగుతున్నాయి. 

అనీస్ బజ్మీ ఈ కామెడీ ఎంటర్టైనర్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో వెంకటేష్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అలాగే 2019లో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ గా F2 చిత్రం బోణి కొట్టింది. ఇక కోలీవుడ్ - మలయాళం భాషల్లో కూడా F2 రీమేక్ కు పలువురు స్టార్ హీరోస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరి ఈ బాక్స్ ఆఫీస్ కథలో ఎవరు నటిస్తారో చూడాలి. తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే బాలీవుడ్ రీమేక్ పై దిల్ రాజు ఆఫీస్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి