ప్రీమియర్ షో టాక్: F2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)

By Prashanth MFirst Published Jan 12, 2019, 6:26 AM IST
Highlights

టాలీవుడ్ సంక్రాంతి భరిలో చివరగా వస్తోన్న చిత్రం F2.  వెంకటేష్ - వరుణ్ తేజ్ కథనాయకులుగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ కి అనిక్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు సినిమాను నిర్మించారు. ఇక సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందుగా యూఎస్ ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఆ టాక్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

దర్శకుడు అనిల్ రావిపూడి కథ కన్నా సీన్స్ బేస్ చేసుకొని సినిమాని ఆసక్తిగా తెరకెక్కించడాని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా వరుణ్ పాత్రను ఒక తెలంగాణ యువకుడిగా ప్రజెంట్ చేయడం బావుంది. సినిమా కాన్సెప్ట్ ఏమిటో ట్రైలర్ లోనే తెలిసిపోయింది. పెళ్లికి ముందు పెళ్లి తరువాత మగాళ్ల జీవితం ఏమిటి అనే కాన్సెప్ట్ తో మంచి కామెడీని క్రియేట్ చేశారు.

వెంకటేష్ చాలా రోజుల తరువాత మంచి కామెడీ టైమింగ్ పాత్ర చేశారు. ఇక వరుణ్ కూడా పోటీ పడి నటించాడు. ఇంటర్వెల్ లో స్మాల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. తమన్నా - మెహ్రీన్ లు డామినేట్ చేసే సిస్టర్స్ గా అలరించారు. ఇక రాజేంద్రప్రసాద్ - ప్రకాష్ రాజ్ పాత్రలు కూడా నవ్విస్తాయి. అయితే అక్కడక్కడా కొంచెం రొటీన్ కామెడీ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. 

మొత్తంగా సినిమా కథలో కొత్తదనం లేకపోయినా సీన్స్ తోనే దర్శకుడు స్క్రీన్ ప్లే ను సెట్ చేసుకున్నాడు. ఇక ఫైనల్ గా సినిమా అయితే ఆడియెన్స్ అంచనాలను అందుకోకపోవచ్చు గాని జస్ట్ ఒకే అని చెప్పవచ్చు. మరి మన ఆడియేన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

click me!