మహేష్ తో బోయపాటి.. ఇది పక్కా!

Published : Jan 11, 2019, 08:12 PM IST
మహేష్ తో బోయపాటి.. ఇది పక్కా!

సారాంశం

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి వివరణ ఇచ్చాడు. మొదటిసారి మహేష్ తో కలవబోతున్నట్లు కూడా చెప్పాడు. 

మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను రామ్ చరణ్ తో తెరకెక్కించిన వినయ విధేయ రామ నేడు విడుదలైన సంగతి తెలిసిందే.  ఇక సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ తో ప్రస్తుతం ఈ దర్శకుడు బిజీగా ఉన్నాడు. ఇకపోతే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి వివరణ ఇచ్చాడు. మొదటిసారి మహేష్ తో కలవబోతున్నట్లు కూడా చెప్పాడు. 

బోయపాటి నెక్స్ట్ బాలకృష్ణతో అయితే ఒక సినిమా చేయనున్నట్లు ఇదివరకే ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ లో చెప్పేశాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా చర్చలు జరిపినట్లు చెబుతూ తప్పకుండా ఆయనతో ఒక మంచి సినిమా ఉంటుందని స్ట్రాంగ్ గా చేప్పేశాడు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక సినిమాను చేస్తాను అని బోయపాటి క్లారిటీ ఇచ్చేశాడు. 

అయితే మహేష్ సినిమా గురించి పూర్తిగా మాట్లాడని బోయపాటి తప్పకుండా ఆయనతో సినిమా ఉంటుందని చెప్పాడు. చూస్తుంటే మహేష్ సుకుమార్ తో వర్క్ చేసిన అనంతరం ఈ దర్శకుడితోనే కలిసే అవకాశం ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇక అప్పటిలోపు బోయపాటి బాలకృష్ణతో ఒక సినిమాను పూర్తి చేస్తాడు. మహేష్ - బోయపాటి కాంబో సరికొత్తగా ఉంటుందని చెప్పవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు