'ఎఫ్ 2' ట్రైలర్.. అన్ లిమిటెడ్ ఫన్!

Published : Jan 07, 2019, 08:24 PM ISTUpdated : Jan 07, 2019, 08:27 PM IST
'ఎఫ్ 2' ట్రైలర్.. అన్ లిమిటెడ్ ఫన్!

సారాంశం

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి 'ఎఫ్2' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్‌ తేజ్‌, వెంకటేష్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి 'ఎఫ్2' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్‌ తేజ్‌, వెంకటేష్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.  ట్రైలర్ మొత్తం కామెడీతో నింపేసింది.

కొత్తగా పెళ్లైన జంట మధ్య ఉండే ఫన్, ఫ్రస్ట్రేషన్ ని ఇందులో చూపించారు. ఇందులో వెంకీ, వరుణ్‌ తోడల్లుళ్ల పాత్రల్లో సందడి చేయబోతున్నారు. 2 నిమిషాల 10 సెకన్ల ఈ ట్రైలర్ లో క్లీన్ కామెడీతో ఉన్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి పండగ సినిమా ఇదే అనిపిస్తోంది. తమన్నా, మేహ్రీన్ లు తమ హాట్ హాట్ అందాలతో కవ్వించడం ఖాయమనిపిస్తోంది.

గ్రాండ్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. వెంకటేష్, వరుణ్ తేజ్ లు తెలంగాణా యాస మాట్లాడుతూ మరింతగా ఆకట్టుకున్నారు. జనవరి 12న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా