మళ్లీ వార్తల్లోకి ‘ఎఫ్2’..అయితే ఈ సారి

Surya Prakash   | Asianet News
Published : Aug 22, 2020, 07:13 AM IST
మళ్లీ వార్తల్లోకి  ‘ఎఫ్2’..అయితే ఈ సారి

సారాంశం

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వీరిద్దరూ హీరోలుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్. భార్యల వల్ల హీరోలు  ఫ్రస్ట్రేషన్‌కు గురవుతూ  ఫన్‌ పంచటం ప్రేక్షకులకు  తెగ నచ్చేసింది. 

భార్యా బాధితులుగా వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు  తెగ నవ్వించేసి, డబ్బులు సంపాదించేసారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వీరిద్దరూ హీరోలుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్. భార్యల వల్ల హీరోలు  ఫ్రస్ట్రేషన్‌కు గురవుతూ  ఫన్‌ పంచటం ప్రేక్షకులకు  తెగ నచ్చేసింది. క్రితం సంక్రాంతికి థియేటర్‌కు వచ్చిన ఈ అల్లుళ్లు జోరుకు డిస్ట్రిట్యూటర్స్ ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు.

 ఈ నేపధ్యంలో కన్నడ వెర్షన్ సైతం నవ్వించటానికి సిద్దమైంది. స్టార్ సువర్ణలో ఈ చిత్రం కన్నడ డబ్బింగ్ వెర్షన్ త్వరలో అలరించబోతోంది. ఈ మేరకు ప్రకటన వచ్చింది. కన్నడ డబ్బింగ్ రైట్స్ సైతం దిల్ రాజు మంచి రేటుకు అమ్మినట్లు సమాచారం. కన్నడ టీవిల్లో ఈ సినిమా అదరకొడుతుందని నమ్ముతున్నారు.
  
 శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో హీరో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించగా.. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, రఘబాబు, నాజర్, అన్నపూర్ణ, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే