ఎఫ్‌2కి అరుదైన పురస్కారం.. వెంకీ, వరుణ్‌ ఖుషీ ఖుషీ!

By Aithagoni RajuFirst Published Oct 21, 2020, 2:17 PM IST
Highlights

ప్రతిష్టాత్మక పనోరమా విభాగంలో టాలీవుడ్‌కి చెందిన `ఎఫ్‌2`కి అవార్డు దక్కడం విశేషం. మొత్తం వివిధ భాషలకు చెందిన 26 సినిమాలను ఈ అవార్డుల కోసం ఎంపిక చేయగా, అందులో తెలుగు నుంచి ఒకే ఒక్క చిత్రం `ఎఫ్‌2` ఉండటం మరో విశేషం.

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా రూపొందిన మల్టీస్టారర్‌ `ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌`(ఎఫ్‌2)కి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ పెస్టివల్‌ ఆప్‌ ఇండియా  కు చెందిన పురస్కారం దక్కించుకుంది. ప్రతిష్టాత్మక పనోరమా విభాగంలో టాలీవుడ్‌కి చెందిన `ఎఫ్‌2`కి స్పెషల్‌ జ్యూరీ అవార్డు దక్కడం విశేషం. మొత్తం వివిధ భాషలకు చెందిన 26 సినిమాలను ఈ అవార్డుల కోసం ఎంపిక చేయగా, అందులో తెలుగు నుంచి ఒకే ఒక్క చిత్రం `ఎఫ్‌2` ఉండటం మరో విశేషం. తమ సినిమాకి కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. 

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటించారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. కేవలం 30కోట్లతో రూపొంది, ఏకంగా దాదాపు 120కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. దీన్ని దిల్‌రాజు నిర్మించడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. 

and Director win awards in prestigious Indian Panorama for 2019. is the only film from Telugu.

Congratulations to and Team pic.twitter.com/HHYxX9bm8o

— Sri Venkateswara Creations (@SVC_official)
click me!