'ఎఫ్2': కలెక్షన్లు పెంచడానికి మరో ట్రిక్!

Published : Jan 25, 2019, 04:09 PM IST
'ఎఫ్2': కలెక్షన్లు పెంచడానికి మరో ట్రిక్!

సారాంశం

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎఫ్2' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు వారాల్లో ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ సాధించి ఆశ్చర్యపరిచింది. 

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎఫ్2' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు వారాల్లో ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ సాధించి ఆశ్చర్యపరిచింది.

సంక్రాంతికి విడుదలైన మిగిలిన సినిమాలకు ఫ్లాప్ టాక్ రావడం కూడా ఎఫ్2 కి అడ్వాంటేజ్ గా మారింది. ఆడియన్స్ ఎఫ్2 తప్ప మరొక ఆప్షన్ లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. సినిమా విడుదలై రెండు వారాలు పూర్తి కావడంతో కలెక్షన్లు పెంచడానికి నిర్మాతలు మరో ట్రిక్ ప్లే చేస్తున్నారు.

జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఐదు కామెడీ సీన్లను సినిమాలో యాడ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఇప్పటికే సినిమాలో కామెడీని తెగ ఎంజాయ్ చేస్తోన్న ప్రేక్షకులు రేపటి నుండి మరింత ఫన్ ను ఎంజాయ్ చేయనున్నారు.

సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి నిర్మాతల ఆలోచన బాగానే ఉంది. మరి ఈ సినిమా ఇంకెన్ని కలెక్షన్లను రాబడుతుందో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?