నటి స్కిన్ కలర్ పై ట్రోల్స్.. పోలీసులకు ఫిర్యాదు!

Published : Jul 03, 2021, 03:36 PM IST
నటి స్కిన్ కలర్ పై ట్రోల్స్.. పోలీసులకు ఫిర్యాదు!

సారాంశం

హీరోయిన్స్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ చాలా మంది వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగాలీ నటి శృతి దాస్, సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించారు.   


నటులకు, సెలబ్రెటీలకు సోషల్ మీడియా వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ చాలా మంది వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగాలీ నటి శృతి దాస్, సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించారు. 


గత రెండేళ్లుగా శృతి దాస్ స్కిన్ కలర్ ని ఉద్దేశిస్తూ విపరీతంగా కొందరు నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారట. సన్నిహితుల సలహా మేరకు చాలా కాలంగా వేధిస్తున్నా శృతి ట్రోల్స్ పై రియాక్ట్ కాలేదట. ఆమెపై సోషల్ మీడియా వేధింపులు మరింత ఎక్కువ కావడంతో, ఇక ఉపేక్షించలేక కలకత్తా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. 


ఇప్పటికీ వీటిపై స్పందిచకపోతే వారి మాటలను అంగీకరించినట్లు అవుతుంది. అలాగే వేధింపులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అందుకే కంప్లైంట్ చేశానని ఆమె తెలియజేశారు. 2019లో మొదలైన త్రినయని అనే సీరియల్ తో శృతి నటిగా మారారు. అలాగే దేశర్ మాతి అనే సీరియల్ లో ఆమె లీడ్ రోల్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

విజయ్ దేవరకొండ డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ ఉన్నట్టా లేనట్టా? రౌడీ హీరో అభిమానులకు కు షాకింగ్ న్యూస్..
Bigg Boss Telugu 9 గ్రాండ్‌ ఫినాలే రికార్డ్ రేటింగ్‌.. నాగార్జున ఎమోషనల్‌ పోస్ట్.. ఐదు సీజన్లలో టాప్‌