అమెజాన్ ప్రైమ్ లో 'ఎఫ్‌2': కలెక్షన్స్ పై ప్రభావం ఏ మేరకు?

By Udaya DFirst Published Feb 13, 2019, 9:29 AM IST
Highlights

ఈ నెల 11నుంచి  `ఎఫ్‌2` కు  దెబ్బపడనుందనే అంతా భావించారు. ఎందుకంటే ముందే చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ వారు ఎఫ్ 2 సినిమాని ఫిబ్రవరి 11 నుంచే లైవ్ స్టీమ్ చేయటం మొదలెట్టారు.

ఈ నెల 11నుంచి  'ఎఫ్‌2' కు  దెబ్బపడనుందనే అంతా భావించారు. ఎందుకంటే ముందే చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ వారు ఎఫ్ 2 సినిమాని ఫిబ్రవరి 11 నుంచే లైవ్ స్టీమ్ చేయటం మొదలెట్టారు. దాంతో కలెక్షన్స్ డ్రాప్ అవుతాయని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ తో నడుస్తోంది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ రిలాక్స్ ఫీలువుతున్నారు. 

రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా, అమెజాన్ లో వచ్చేసినా, పైరసీ ప్రింట్ బయిటకు వచ్చేసినా కలెక్షన్స్ స్టడీగా ఉండటం సినిమా సత్తా ఏంటనేది తెలియచేస్తోంది. అలాగే అదే సమయంలో ....అమెజాన్ ప్రైమ్ ప్రభావం అంతంత మాత్రమే అని తెలియచేసింది. 

ఇక పండగ సీజన్ కు సరిగ్గా సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం ‘ఎఫ్-2’. వెంకటేష్-వరుణ్ తేజ్ క్రేజీ కాంబినేషన్లో   దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు.  ఈ చిత్రం కలెక్షన్స్ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయ్యినా ఇప్పటికీ దుమ్ము రేపుతున్నాయి. 

ముఖ్యంగా సంక్రాంతి బరిలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు , పేట , వినయ విధేయ రామ చిత్రాలు ఘోర పరాజయం సాధించడంతో ఎఫ్ 2 కు బాగా కలిసి వచ్చింది  ఎఫ్ 2 ఇప్ప‌టికే దాదాపు 80 కోట్ల మేర షేర్ రాబ‌ట్టింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది.  

click me!