అభిమానుల కోసం 50 ఏళ్ళుగా ఆ ఆచారం కొనసాగిస్తున్న అమితాబ్, అస్సలు మిస్ అవ్వడట.

By Mahesh JujjuriFirst Published Jun 7, 2023, 7:37 AM IST
Highlights

బిగ్ బీ అమితాబచ్చన్ గత 50 ఏళ్లుగా ఓ ఆచారాన్ని కొనసాగిస్తున్నారట. అది కూడా అభిమానుల కోసం.. అత్యవసరం అయితే తప్పించి అస్సలు మిస్ అవ్వడట బిగ్ బీ. అంతే కాదు ఆ టైమ్ లో చెప్పులు కూడా వేసుకోడట. ఇంతకీ ఏంటా పని. 

బాలీవుడ్‌ దిగ్గజం.. బిగ్ బీ అమితాబ్ అంటే దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు ప్రాణం.  ఆయన కోసం లక్షల్లో ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. ఆయన సినిమా చూడాలని కోట్లలో అభిమానులు వెయిట్ చేస్తుంటారు. ఇక అమితాబ్ ను ఒక్కసారైనా చూడాలని ఎంతో మంది ఆశతో ఉంటారు. ఇక బిగ్ బీ  అమితాబ్‌ బచ్చన్‌ పలకరింపు కోసం ప్రతీ ఆదివారం ముంబయిలోని ఆయన స్వగృహం జల్సా వద్ద వేలాదిగా  అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఆయన ప్రతీ ఆదివారు  తన ఇంటి బాల్కనీలోకి వచ్చి  కొద్ది సేపు నిల్చొని అభిమానులకు అభివాదం చేసి వెళ్లి పోతారు.

ఫ్యాన్స్ ను సంతోషపెడుతూ.. తాను కూడా అమితానందం పొందే ఈ ఆచారం  అమితాబ్‌ బచ్చన్‌ గత 50 ఏళ్లకు పైగా ఆచరిస్తున్నారట. ప్రతీ ఆదివారం ఏం మిస్ అయినా..  ఈఆనవాయితీని మాత్రం  ఆయన మిస్ అవ్వడట. అంతే కాదు ఇంకో గొప్ప విషయం ఏంటీ అంటే.. ఆయన అభిమానులను కలిసే టైమ్ లో కాళ్ళక చెప్పులు వేసుకోరట.  దీని వెనకున్న కారణాన్ని వివరిస్తూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు అమితాబ్‌ బచ్చన్‌. గుడికి వెళ్లినప్పుడు మనం చెప్పులను బయటే విడిచివెళ్తాం కదా…ప్రతీ ఆదివారం నా ఇంటి ప్రాంగణం నాకు ఓ దేవాలయంలా కనిపిస్తుంది.అభిమానులు దేవుళ్ల మాదిరిగా దర్శనమిస్తారు. అందుకే వారికి అభివాదం చేసే సమయంలో పాదరక్షలు అస్సలు ధరించను అన్నారు. 

అంతే కాదు దాదాపు 50 ఏళ్లుగా నేను అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నాను  అని అమితాబ్‌ బచ్చన్‌ తెలిపారు. ఒకవేళ తాను ఏ కారణం చేతనైనా ఆదివారం అందుబాటులో లేకపోతే రెండు మూడు రోజుల ముందుగానే ఆ విషయాన్ని తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు. అందుకే అమితాబ్ అంటే అభిమానులు అంతగా ప్రేమిస్తారు.. ఆదరిస్తారు. దేవుడిలా కొలుస్తారు. ఇక బిగ్ బీ సినిమాల విషయానికి వస్తే..  ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌ తెలుగులో  ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పార్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్‌-కె లో నటిస్తున్నారు. రీసెంట్ గా  హైదరాబాద్‌ లో జరిగిన  షూటింగ్‌లో ఆయన గాయపడిన విషయం తెలిసిందే. కొద్దిరోజులు ఇంటి వద్దే చికిత్స తీసుకొని కోలుకున్న అమితాబ్‌ బచ్చన్‌ ప్రస్తుతం సెక్షన్‌ 84 చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

click me!