భీమ్లా నాయక్ అప్డేట్: పవన్ కాదు... నేనే హీరో అంటున్న రానా

Published : Sep 20, 2021, 07:03 PM ISTUpdated : Sep 20, 2021, 07:12 PM IST
భీమ్లా నాయక్ అప్డేట్: పవన్ కాదు... నేనే హీరో అంటున్న రానా

సారాంశం

భీమ్లా నాయక్ మూవీ నుంచి రానా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేశారు. నెగిటివ్ షేడ్స్ కలిగిన డేనియల్ శేఖర్ గా రారా పోషిస్తున్న పాత్ర స్వరూప, స్వభావాలు, తీరు తెన్నులు ఎలా ఉంటుందో... ఫస్ట్ గ్లిమ్స్ వీడియో ద్వారా తెలియజేశారు.

“నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట? స్టేషన్ లో టాక్ నడుస్తోంది. నేనెవరో తెలుసా ధర్మేంద్ర, హీరో… హీరో…డేనీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ వన్” అంటూ  రానా చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. 

ప్రస్తుతం చిత్రం షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రం లో నిత్య మీనన్ నాయిక. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి
3 Roses 2 OTT Review: 3 రోజెస్‌ సీజన్‌ 2 రివ్యూ.. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత బోల్డ్ సిరీస్‌ ఎలా ఉందంటే?