నిన్న చిరంజీవి, ఇప్పుడు బాలయ్యని కలిసిన నిర్మాతలు.. షూటింగ్‌ల బంద్‌ వ్యవహారంలో బిగ్‌ ట్విస్ట్

Published : Aug 06, 2025, 07:35 PM IST
balakrishna

సారాంశం

మంగళవారం చిరంజీవిని కలిసి షూటింగ్‌ల బంద్‌కి సంబంధించిన సమస్యని వివరించారు నిర్మాతలు. తాజాగా బాలయ్యని కలవడం విశేషం. ఈ సమస్య ఆసక్తికర పరిణామాలకు దారితీస్తోంది. 

DID YOU KNOW ?
`అఖండ 2`తో బాలకృష్ణ
ప్రస్తుతం బాలకృష్ణ `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇది సెప్టెంబర్‌ 25న విడుదల కాబోతుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్‌ల బంద్‌ వ్యవహారం ఆసక్తికర పరిణామాలకు దారితీస్తుంది. సినీ కార్మికులకు, నిర్మాతలకు చర్చలు విఫలం కావడంతో సినీ కార్మికులు షూటింగ్‌ల బంద్‌కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని నిర్మాతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులకు తీసుకొచ్చి షూటింగ్‌లు జరిపించారు. దీన్ని స్థానిక ఫెడరేషన్‌ నాయకులు, కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొన్ని గొడవలు కూడా జరిగాయి.

గొడవలకు దారితీసిన షూటింగ్‌ల బంద్‌ వ్యవహారం

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న ప్రభాస్‌ మూవీ `ది రాజాసాబ్‌` మూవీ సెట్ డ్యామేజ్‌ అయ్యింది. దీనిపై కోర్ట్ నుంచి నోటీసులు పంపించారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌. `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` షూటింగ్‌ సమయంలో నిర్మాత చెర్రీతో కార్మికులకు గొడవలు జరిగాయి. అదే సమయంలో సారథి స్టూడియోలో సీరియల్‌ షూటింగ్‌ని కాస్ట్యూమర్స్ యూనియన్‌ నాయకులు అడ్డుకున్నారు. ఇందులో కాస్ట్యూమర్‌ సత్యనారాయణపై దాడి చేశారు యూనియన్‌ కార్యదర్శి నరసింహరావు. ఆయనపై కేసు నమోదైంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమస్య చిరంజీవి వద్దకు వెళ్లింది.

చిరంజీవిని కలిసి సమస్య వివరించిన నిర్మాతలు

మంగళవారం నిర్మాతలు సుప్రియ, రవిశంకర్‌, సి కళ్యాణ్‌, దామోదర ప్రసాద్‌ వంటి వారు చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. సమస్యని వివరించారు. ఆయన ఈ బంద్‌పై విచారం వ్యక్తంచేసినట్టు నిర్మాత సి కళ్యాణ్‌ తెలిపారు. అదే సమయంలో కార్మికులతోనూ మాట్లాడతానని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని చిరంజీవి చెప్పినట్టు సి కళ్యాణ్‌ వెల్లడించారు.

బాలయ్య వద్దకు వెళ్లిన నిర్మాతలు..

ఈ క్రమంలో ఇప్పుడు నిర్మాత బాలయ్యని కలవడం విశేషం. ప్రసాద్ ల్యాబ్లో `అఖండ 2` సినిమాకి సంబంధించిన డబ్బింగ్‌ పనుల్లో ఉన్నారు బాలకృష్ణ. ఈ విషయం తెలుసుకుని ఆయన్ని నిర్మాతలు బుధవారం కలిశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్‌ ఫిల్మ్ ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ భరత్‌ భూషణ్‌, నిర్మాత గోపీనాథ్‌ ఆచంట, దామోదర ప్రసాద్‌, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్‌ వంటి నిర్మాతలు కలిసిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని పరిస్థితిని ఆయనకు వివరించారు. ఫిల్మ్ ఫెడరేషన్‌ డిమాండ్స్ ని, యాక్టీవ్‌ ప్రొడ్యూర్స్ గిల్డ్ నిర్ణయాలు ఆయనకు తెలియజేశారు.

ప్రతి హీరో ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలని వెల్లడి

ఈ సందర్భంగా బాలయ్య స్పందిస్తూ, ప్రతి హీరో సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చేయాలని, తాను సంవత్సరానికి 4 సినిమాలు చేస్తానని చెప్పారు. నిర్మాణ వ్యయం పెరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కార్మికులు కూడా పరిశ్రమలో బాగామే అని, త్వరలో సమస్యలు తొలగిపోతాయి అని బాలకృష్ణ చెప్పడం విశేషం. కానీ అసలు సమస్యకు పరిష్కారం రాలేదు. బంద్‌ ఇంకా కొనసాగుతుంది. మరి దీనిపై ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమస్యకి ఎవరు పరిష్కారం చూపిస్తారో చూడాలి.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?