గోవాలో డైరెక్టర్ పూరి బర్త్ డే వేడుకలు... కేక్ లో విస్కీ బాటిల్స్, వర్మ శిష్యులంటే ఆ మాత్రం ఉండాలి మరి!

Published : Sep 28, 2021, 02:49 PM IST
గోవాలో డైరెక్టర్ పూరి బర్త్ డే వేడుకలు... కేక్ లో విస్కీ బాటిల్స్, వర్మ శిష్యులంటే ఆ మాత్రం ఉండాలి మరి!

సారాంశం

పూరి జగన్నాధ్ నేడు 55వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ బర్త్ డే వేడుకల కోసం తన టీమ్ తో కలిసి గోవా చెక్కేశారు పూరి. ఇక పూరి ప్రొడక్షన్ పార్టనర్ ఛార్మి ఆయన బర్త్ డే వేడుకలు సరికొత్తగా ప్లాన్ చేశారు.

హీరోలకే డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారంటే పొరపాటే, పూరి జగన్నాధ్ లాంటి దర్శకులకు కూడా డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. టాలీవుడ్ కొత్త హీరోయిజం, మేకింగ్ నేర్పిన దర్శకులలో పూరి జగన్నాధ్ కూడా ఒకరు. ఇండస్ట్రీ హిట్స్ అట్టర్ ప్లాప్ ఆయన తీసిన మూవీ ఫలితం ఏదైనా.. ఆయన మార్క్ చూపిస్తారు. 


పవర్ ఫుల్ డైలాగ్స్, సరికొత్త కథలకు కేర్ ఆఫ్ అయిన పూరి జగన్నాధ్ నేడు 55వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ బర్త్ డే వేడుకల కోసం తన టీమ్ తో కలిసి గోవా చెక్కేశారు పూరి. ఇక పూరి ప్రొడక్షన్ పార్టనర్ ఛార్మి ఆయన బర్త్ డే వేడుకలు సరికొత్తగా ప్లాన్ చేశారు. ఆయన కోసం తయారు చేయించిన కేక్ లో విస్కీ బాటిల్స్ తో డిజైన్ చేయించారు. 


పబ్లిక్ ఫిగర్స్, సెలెబ్రిటీలు తమకు ఎలాంటి చెడ్డ అలవాట్లు ఉన్నా, ఇలా బహిర్గతంగా చెప్పుకోరు. మరి వర్మ స్కూల్ నుండి వచ్చిన ఆయన శిష్యులుగా పూరి కూడా ఆయన సిద్ధాంతాలే ఫోలో అవుతారు. వర్మ అంత బోల్డ్ కాదు కానీ, ఓ యాభై శాతం వర్మను పూరీలో చూడవచ్చు. 


ఇక దర్శకుడు పూరికి టాలీవుడ్ టాప్ స్టార్స్ మహేష్, రవితేజ వంటివారు బెస్ట్ విషెష్ తెలియజేశారు. మరోవైపు విజయ్ దేవరకొండతో ఆయన చేస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్ పై బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. లైగర్ మూవీ కోసం ఇంటెర్నేషనల్ సెలిబ్రిటీ మైక్ టైసన్ ని రంగంలోకి దించినట్లు తెలియజేశారు. 
 

PREV
click me!

Recommended Stories

2025 లో 300 కోట్ల క్లబ్‌లో చేరిన 8 సినిమాలు, అందులో టాలీవుడ్ మూవీస్ ఎన్ని?
Ram Charan: రాంచరణ్- జాన్వీ కపూర్ నుంచి కార్తీక్ - శ్రీలీల వరకు.. 2026లో రాబోయే క్రేజీ జంటలు