బిగ్ బాస్ సీజన్ 5:  లీకులతో ఆసక్తి పోతుంది... ఇక వచ్చే వారం ఆ నలుగురిలో ఒకరు అవుట్?

Published : Sep 28, 2021, 02:05 PM IST
బిగ్ బాస్ సీజన్ 5:  లీకులతో ఆసక్తి పోతుంది... ఇక వచ్చే వారం ఆ నలుగురిలో ఒకరు అవుట్?

సారాంశం

వరుస లీకులు బిగ్ బాస్(Bigg boss) పై ప్రేక్షకులలో ఆసక్తి తగ్గడానికి కారణం అవుతుంది. కీలకమైన ఎపిసోడ్స్, ఎలిమినేషన్స్ కి సంబంధించిన న్యూస్ ముందుగానే వచ్చేస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 5 అనేక ఒడిడుకులు ఎదుర్కొంటుంది. గత సీజన్స్ తో పోల్చుకుంటే అనుకున్నంతగా టీఆర్పీ రావడం లేదన్న మాట వినిపిస్తుంది. ఒకపక్క ఐపిఎల్, మరో ప్రక్క ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో నుండి బిగ్ బాస్ గట్టి పోటీని ఎదుర్కొంటుంది. ఎంత మసాలా, కాంట్రవర్సీ జోడించిన ఫలితం లేకుండా పోతుంది. 


వరుస లీకులు కూడా ప్రేక్షకులలో ఆసక్తి తగ్గడానికి కారణం అవుతుంది. కీలకమైన ఎపిసోడ్స్, ఎలిమినేషన్స్ కి సంబంధించిన న్యూస్ ముందుగానే వచ్చేస్తుంది. వచ్చేవారం ఎవరు ఎలిమినేట్ కానున్నారనే విషయం రెండు రోజులు ముందే లీక్ అవుతుంది. ప్రచారం జరిగిన విధంగా సరయు, ఉమాదేవి, లహరి హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. 


బిగ్ బాస్ హౌస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించడం వలన ఈజీగా బిగ్ బాస్ హౌస్ విషయాలు బయటికి వచ్చేస్తున్నాయి. మొదటి సీజన్లో బిగ్ బాస్ సెట్ పూణేలో నిర్మించగా, అంతగా లీకులు బయటికి రాలేదు. ఇక ఈ వారం నటరాజ్ మాస్టర్,యాంకర్ లోబో,యాంకర్ రవి, నటి ప్రియ,ఆర్జే కాజల్, సిరి హన్మంత్,విజే సన్నీ, అనీ మాస్టర్ మొత్తం 8మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. 


వరుసగా ముగ్గురు అమ్మాయిలు ఎలిమినేట్ అయిన నేపథ్యంలో నెక్స్ట్ అబ్బాయి ఎలిమినేట్ కానున్నారన్న మాట వినిపిస్తుంది. అంటే లోబో, రవి, సన్నీతో పాటు నటరాజ్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం