`డుంకీ` వాయిదా.. `సలార్‌` కి తిరుగే లేదు.. ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్ ?

By Aithagoni Raju  |  First Published Oct 13, 2023, 11:31 AM IST

ఇప్పటి వరకు `సలార్‌`, `డుంకీ` చిత్రాలు పోటీ పడబోతున్నాయనే అంతా అనుకున్నారు. కానీ మేకర్స్ మాత్రం రాజీకొచ్చినట్టు సమాచారం. ఒక సినిమా కోసం మరొకరు త్యాగం చేశారట. 


ఈ ఏడాది ఎండింగ్‌లో ఇండియన్‌ సినిమాలోనే బిగ్గెస్ట్ ఫైట్‌ జరగబోతుందని అంతా భావించారు. ప్రభాస్‌ `సలార్‌`, షారూఖ్‌ ఖాన్‌ `డుంకీ` చిత్రాలు ఓకే డేట్‌కి రిలీజ్‌ కాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో రెండు భారీ చిత్రాల మధ్య గట్టి పోటీ నెలకొనబోతుంది. ఇది రెండు సినిమాలపై ప్రభావం పడబోతుంది. ఈ రెండింటికి రెండూ భారీ సినిమాలు. పైగా `కేజీఎఫ్‌` తర్వాత ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న చిత్రం `సలార్‌` కావడం, అలాగే ఓటమెరుగని బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ తెరకెక్కిస్తున్న మూవీ `డుంకీ` కావడం విశేషం. రెండింటికి రెండు ఏదీ తక్కువ కాదు. దీంతో బాక్సాఫీసు వద్ద రెండూ పోటీపడితే కలెక్షన్లపై ప్రభావం పడుతుంది. 

అయితే ఇప్పటి వరకు ఈ రెండూ పోటీ పడబోతున్నాయనే అంతా అనుకున్నారు. కానీ మేకర్స్ మాత్రం రాజీకొచ్చినట్టు సమాచారం. ఒక సినిమా కోసం మరొకరు త్యాగం చేశారట. మరో డేట్‌కి మారిపోతున్నట్టు సమాచారం. ఇప్పటికే `సలార్‌` పలు మార్లు వాయిదా పడింది. చివరికి డిసెంబర్‌ 22ని ఫైనల్‌ చేశారు. ఇంకా డేట్ మార్చే అవకాశం లేదు. అదే డేట్‌ ని ఫిక్స్ చేశారట. దీంతో  షారూఖ్‌ ఖాన్‌ `డుంకీ` బ్యాక్‌ వెళ్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. జనవరిలోగాని, లేదంటే మరో మంచి డేట్‌కి ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం కొత్త డేట్‌పై వర్క్‌ చేస్తున్నట్టు సమాచారం. 

Latest Videos

షారూఖ్‌ కి ఇప్పటికే ఈ ఏడాది రెండు ఇండస్ట్రీ హిట్లు అందుకున్నాడు. ప్రారంభంలో `పఠాన్‌`తో వెయ్యి కోట్లు వసూలు చేశాడు. ఇటీవల `జవాన్‌`తో మరో వెయ్యి కోట్ల సినిమా చేశాడు. అయినా ఇప్పుడు ప్రభాస్‌ కోసం బ్యాక్‌ అయినట్టు, పోటీ పడటం చిత్ర పరిశ్రమకి మంచి వాతావరణం కాదని భావించి బ్యాక్‌ అయినట్టు సమాచారం. మొత్తానికి `డుంకీ` వెనక్కి వెళ్తుందని తెలుస్తుంది. సినీ క్రిటిక్స్, విశ్లేషకులు ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. 

ఇక ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న `సలార్‌`లో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది. మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా చేస్తున్నారు. జగపతిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న చిత్రమిది. `కేజీఎఫ్‌` వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో `సలార్‌`పై భారీ అంచనాలున్నాయి. దీనికితోడు ఇది రెండు భాగాలుగా రాబోతుంది. `సలార్‌ః సీజ్‌ ఫైర్‌` పేరుతో మొదటి భాగం రానుంది. ఇందులో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. 
 

click me!