
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh), అక్కినేని హీరో సుశాంత్(Sushanth) ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చింది. తమిళ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా వచ్చిన భోళా శంకర్ సినిమాకు ఆడియన్స్ మార్నింగ్ షో నుంచే తేడా టాక్ వచ్చింది. అంతేకాదు ఊహకు అందని విధంగా ఓపినింగ్స్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి. ట్రైలర్, టీజర్ వర్కవుట్ కాకపోవటం, సినిమాకు బజ్ లేకపోవటంతో ఓపినింగ్స్ లేవు. దాంతోఈ చిత్రం లెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. ఇది మెగాభిమానులకు జీర్ణించుకోలేని విషయంగా ఉంది.
ఇదిలా ఉండగా ఈ చిత్రం హిందీ వెర్షన్ రిలీజ్ కు రంగం సిద్దం చేసింది టీమ్. ఆగస్ట్ 25న ఈ నార్త్ లో భారీగా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దాంతో చాలా మంది బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. నార్త్ లోనూ పరువు తీయటానికా ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేయటం అని కొందరు అంటూంటే..వాళ్లకు నాలుగు ఫైట్స్ ఉంటే చాలు సౌత్ నుంచి వచ్చిన ఏ సినిమా అయినా ఎగబడి చూసేస్తారు. అక్కడ హిట్ అయినా ఆశ్చర్యం లేదని మరికొందరు అంటున్నారు. మనకు ఇక్కడ వర్కవుట్ కాని సాహో చిత్రం నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేయటం ఉదాహరణగా చూపెడుతున్నారు. మన దరిద్రం దేశం అంతా చూడాలా అని మరికొందరు చాలా హార్ష్ గా కామెంట్ చేస్తున్నారు. ఇలా ఓ కొత్త డిస్కషన్ ఈ నేపధ్యంలో షురూ అయ్యింది.
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం రైట్స్ 90 కోట్లుకు అమ్ముడయ్యాయి. రికవరీ మాత్రం 40%. మెగాస్టార్ గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. సాధారణ ఆడియన్స్ మాత్రమే కాదు.. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడంలేదు అని అర్దమైపోయింది. సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ఆ రేంజ్ కలెక్షన్స్ రావడం కష్టమే అంటోంది ట్రేడ్ . ఇక మరోవైపు రజనీకాంత్ జైలర్ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో.. ఆ ఎఫెక్ట్ కూడా భోళా శంకర్ కలెక్షన్స్ పడనుంది