తెలుగు మార్కెట్ ను టార్గెట్ చేసిన మలయాళ యంగ్ హీరో, ఇక్కడే సెటిల్ అవుతాడే ఏంటీ..?

Published : Jul 28, 2022, 02:10 PM IST
తెలుగు మార్కెట్ ను  టార్గెట్ చేసిన మలయాళ యంగ్  హీరో, ఇక్కడే సెటిల్ అవుతాడే ఏంటీ..?

సారాంశం

పాన్ ఇడియా రేంజ్ లో సత్తా చాటుతున్న టాలీవుడ్ కు ఇతర భాషల నుంచి హీరోలు,హీరోయిన్లు వలస వస్తున్న సంగతి తెలిసిందే. అందులో కొంత మంది సక్సెస్ సాధిస్తున్నారు.. మరికొంత మంది వెనుదిరుగుతున్నారు. ఇక ఆ ప్రయత్నంలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు దుల్కర్ సల్మాన్.   

మళయాళ హీరో అయినా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. టాలీవుడ్ లో ముందుగా డబ్బిగ్ మూవీస్ తో ఎంటర్ అయిన దుల్కర్ కు అవే బాగా కలిసి వచ్చాయి.తెలుగులో రొమాంటిక్ హీరో ఇమేజ్ తో పాటు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించాడు. ఆయన ఎప్పుడెప్పుడు  డైరెక్ట్  తెలుగు మూవీ చేస్తాడా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు మహానటితో ఆ ముచ్చట కూడా తీర్చాడు. ఇక ఇప్పుడు పక్కా టాలీవుడ్ హీరో్ అనిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు యంగ్ స్టార్. 

తెలుగులో  తక్కువ సినిమాలు డబ్ అయినా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ సూపర్ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు డైరెక్ట్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. నాన్ తెలుగు హీరోల్లో సూర్య తర్వాత అంత క్రేజ్ సంపాదించుకుంటున్న హీరో దుల్కర్ సల్మాన్. ఇంటెన్స్ లుక్స్ తోనే, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూ వస్తున్నాడు మలయాళ స్టార్. 

మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన  దుల్కర్ సల్మాన్... మళయాళ ఇండస్ట్రీలో స్టార్  హీరో ఇమేజ్ ఎప్పుడో సాధించాడు. ఇక ఇప్పుడు తన  మెస్మరైజింగ్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగు ఫ్యాన్ బేస్ ని సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఓకే బంగారం, కనులుకనులను దోచాయంటే, మహానటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నారు టాలీవుడ్ లో. ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నారు.

హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ చేస్తున్న సీతారామం మూవీ చేశాడు. యుద్దం రాసిన ప్రేమ కథ క్యాప్షన్ తో తెరకెక్కిన ఈ మూవీ  ఆగస్ట్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సుమంత్  దుల్కర్ తో స్క్రీన్ శేర్ చేసుకోబోతున్నాడు. తెలుగులో దుల్కర్ కి ఇంత క్రేజ్ ఉంది కాబట్టే సోలో హీరోగా ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమాకే బాగా హైప్ సంపాదిస్తున్నాడు. ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. చిత్ర యూనిట్ చేసే ప్రతి ఈవెంట్ కి దుల్కర్ హాజరవుతున్నారు. దీంతో తెలుగులో మార్కెట్ సంపాదించాలని, ఇక్కడ కూడా సినిమాలు వరుసగా తీయాలని ఫిక్స్ అయ్యారు దుల్కర్. 

టాలీవుడ్ లో సెటిల్ అవ్వలని దుల్కర్ ప్రయత్నిస్తున్నాడా..? లేక పోతే  మలయాళ సినిమాలు ఇక్కడ రిలీజ్ చేసుకోడానికి ఈ క్రేజ్ ఉపయోగించుకోవాలి అని చూస్తున్నాడా తెలియదు కాని.. బాలీవుడ్ స్టార్స్ లాగే ఈ మలయాళ స్టార్ కూడా తెలుగులో మార్కెట్ కోసం తాపత్రయపడుతున్నారు. సీతారామం సినిమా సౌత్ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా హిట్ కొడితే దుల్కర్ మార్కేట్ టాలీవుడ్ లో వెలిగిపోవడం ఖాయం. చూడాలి మరి ఈసినిమా ప్రభావం ఎంత ఉంటుందో. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా