గండిపేటలో "మహానటి" సెకండ్ షెడ్యూల్

Published : Jun 22, 2017, 07:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
గండిపేటలో "మహానటి" సెకండ్ షెడ్యూల్

సారాంశం

కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో తెరకెక్కుతున్న మహానటి చిత్రం ఈ చిత్రంలో జెమిని గణేషన్ పాత్రలో నటిస్తున్న మళయాల హీరో దుల్కర్ సల్మాన్ నాగ అశ్విన్ దర్శకత్వంలో గండిపేటలో మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్

అలనాటి మేటినటి సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి" షూటింగ్ ప్రారంభమై ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొన్న విషయం తెలిసిందే. "ఎవడే సుబ్రహ్మణ్యం" చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ "స్వప్న సినిమా" పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ గండిపేటలో జరుగుతోంది. కీర్తి సురేష్-దుల్కర్ సల్మాన్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ లాంగ్ షెడ్యూల్ లో మరింతమంది కీలకపాత్రధారులు కూడా పాల్గొననున్నారు. 

మిగతా పాత్రధారులు మరియు టెక్నీషియన్ల వివరాలు అతి త్వరలో వెల్లడిచేయనున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు!

PREV
click me!

Recommended Stories

Dhanush Vs CM Vijay: ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? విజయ్ కి పోటీ ఇస్తాడా? తండ్రి కస్తూరి రాజా క్లారిటీ!
Karthika Deepam 2 Today Episode: మేనేజర్, జ్యో కుట్ర- దీప బలి- శివన్నారాయణ ఫైర్- దీపకు మరో ఛాన్స్