ధృవ శాటిలైట్ @9.50 కోట్లు

Published : Dec 09, 2016, 02:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
ధృవ శాటిలైట్ @9.50 కోట్లు

సారాంశం

మరోసారి తన చాకచక్యం ప్ర‌ద‌ర్శించిన  అల్లు అరవింద్  9.50 కోట్లకు జెమిని సంస్థ‌ కి శాటిలైట్ రైట్స్ అమ్మ‌కం సినిమా విడుదలకు ఒక రోజు ముందుగానే శాటిలైట్ బిజినెస్ పూర్తి  

నిజానికి సినిమా విడుదల తరువాత అయితే ఈ మొత్తం కాస్త తగ్గి వుండేదని ఇండస్ట్రీ టాక్ ఎందుకంటే ఫ్యామిలీ వ్యూవర్ షిప్ లు ఎక్కువగా కానీ, కచ్చితంగా కానీ వుంటాయనుకునే సినిమాలకు శాటిలైట్ రైట్స్ ఎక్కువ పలుకుతుంది. ధృవ సినిమా ఆ విషయంలో కాస్త మైనస్. ఈ మైండ్ గేమ్ మూవీ సీరియళ్లు అంటే ఇష్టపడే ఆడవాళ్లకు ఏ మేరకు పడుతుందన్నది అనుమానం.

అందుకే సినిమా విడుదల హడావుడిలో వుంటూ కూడా, జెమినితో డిస్కషన్లు కంటిన్యూయస్ గా నడిపి, శాటిలైట్ బిజినెస్ పూర్తి చేసేసారు అరవింద్. ధృవ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 57 దాకా అయ్యిందని వినికిడి. ఈ సినిమా రీమేక్ రైట్స్ నే నాలుగు కోట్లకు పైగా ఇచ్చి తీసుకున్నారు. సో, ఆ యాభై ఏడులో తొమ్మదిన్నర రికవరీ అయిపోయింది. ధృవను అల్లు అరవింద్ దాదాపు డైరక్ట్ గా విడుదల చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

అజిత్‌ పై హీరోయిన్ క్రష్.. నువ్వు నా చెల్లివి అని షాకిచ్చిన హీరో, ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
Gaayapadda Simham Movie Review: గాయపడ్డ సింహం రివ్యూ, తరుణ్ భాస్కర్ కు ట్రంప్ అంటే ఎందుకంత కోపం?