తాగేసి నానా రచ్చ చేసిన టీవీ నటి!

Published : Apr 02, 2019, 01:05 PM IST
తాగేసి నానా రచ్చ చేసిన టీవీ నటి!

సారాంశం

టీవీ నటి, మోడల్ రూహి సైలేజ్ కుమార్ సింగ్(30) తాగేసి పోలీసుల మీదే చేయి చేసుకోవడంతో ఆమెపై కేసులు నమోదయ్యాయి.

టీవీ నటి, మోడల్ రూహి సైలేజ్ కుమార్ సింగ్(30) తాగేసి పోలీసుల మీదే చేయి చేసుకోవడంతో ఆమెపై కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ముంబైలో ఖార్ రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా.. సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తన స్నేహితులు రాహుల్, స్వాప్నిల్ లతో కలిసి మద్యం సేవించిన రూహి సింగ్ కారు నడుపుకుంటూ వచ్చింది.

లింక్ రోడ్డులో ఫుడ్ తినడానికి కారు ఆపారు. అయితే అప్పటికే క్లోజింగ్ టైం పూర్తవ్వడంతో హోటల్ సిబ్బంది ఫుడ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో తాగేసి ఉన్న రూహి వారిపై విరుచుకుపడింది. వారితో గొడవకి దిగడంతో కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన రూహి ఆమె స్నేహితులు పోలీసులపై దాడి చేశారు. ఆ తరువాత వేగంగా కారుని నడిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఐదు కార్లను డ్యామేజ్ చేసింది. ఈ యాక్సిడెంట్ లో ఎవరూ గాయపడలేదు. ఆ తరువాత పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకొని బ్లడ్ సాంపిల్స్ సేకరించారు.

అర్ధరాత్రి మహిళలను అరెస్ట్ చేయకూడదనే రూల్ ఉండడంతో ఆమెపై కేసులు నమోదు చేసి పంపించేశారు. ఆమె ఇద్దరు స్నేహితులను మాత్రం అరెస్ట్ చేశారు. రక్త పరీక్షలు పూర్తయిన అనంతరం రూహిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది