తాగేసి రిసెప్షనిస్ట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కమెడియన్!

Published : Apr 01, 2019, 02:26 PM IST
తాగేసి రిసెప్షనిస్ట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కమెడియన్!

సారాంశం

టాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా నటించి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు తాజాగా ఓ పార్టీలో రిసెప్షనిస్ట్ ని అసభ్యపదజాలం తో దూషించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

టాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా నటించి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు తాజాగా ఓ పార్టీలో రిసెప్షనిస్ట్ నిఅసభ్యపదజాలం తో దూషించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈ కమెడియన్ పబ్లిక్ గా హీరోయిన్లపై కూడా సెక్సీ కామెంట్స్ చేశాడు.

అప్పుడు సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేసి, విమర్శించినా తన తీరుని మాత్రం మార్చుకోలేదు. రీసెంట్ గా ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద హీరో స్టార్ హోటల్ లో పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి సదరు కమెడియన్ తన భార్యతో కలిసి వచ్చాడు. 

అయితే పార్టీ మొదలైన తరువాత అతడు మద్యం ఎక్కువగా సేవించాడు. భర్తని కంట్రోల్ చేయలేక అతడి భార్య కార్ డ్రైవర్ సహాయం తీసుకుందామని అతడిని పిలవడానికి వెళ్లగా.. ఇంతలో సదరు స్టార్ కమెడియన్ హోటల్ లో ఉన్న రిసెప్షనిస్ట్ పై విరుచుకుపడ్డాడు. 

ఆమెపై అసభ్యకర పదజాలం ఉపయోగించడంతో వెంటనే మేనేజర్ కి సంగతి చెప్పి ఇష్యూ చేసిందట. దీంతో పార్టీ ఇచ్చిన ఆ పెద్ద హీరో ఇందులో కల్పించుకొని కమెడియన్ ని విడిపించాడట. లేకపోతే ఈ పాటికి అతడు జైలు లో ఉండేవాడని సంఘటనని దగ్గరగా చూసిన కొందరు వ్యక్తులు చెబుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది