నయనతార 'ఐరా' దెబ్బ చిరు ‘సైరా’ పై..?

Published : Apr 01, 2019, 12:29 PM IST
నయనతార 'ఐరా' దెబ్బ చిరు ‘సైరా’ పై..?

సారాంశం

తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని మహారాణిగా వెలుగుతోంది నయనతార. ఆమె తన సినిమా సైన్ చేస్తే చాలన్నట్లు దర్శక,నిర్మాతలు ఆమె చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. 

తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని మహారాణిగా వెలుగుతోంది నయనతార. ఆమె తన సినిమా సైన్ చేస్తే చాలన్నట్లు దర్శక,నిర్మాతలు ఆమె చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే అదే సమయంలో తెలుగులో ఆమె మార్కెట్ పూర్తిగా డౌన్ అయ్యిపోయింది. ఆమె నటించగా తమిళంలో హిట్ అయిన సినిమాలు ఇక్కడ మినిమం గా ఆడటం లేదు. రీసెంట్ గా వచ్చిన ఐరా సినిమా ఓపినింగ్స్ కూడ రాబట్టలేకపోయింది.

ఇది ఆమెకు పెద్ద సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే ఆమెకు ఆల్రెడి తమిళ మార్కెట్లో క్రేజ్ ఉంది కాబట్టి. కానీ ఆమెతో తెలుగులో సినిమాలు చేస్తున్న సైరా టీమ్ కే కంగారు పట్టుకుందని వినపడుతోంది. బిజినెస్ పరంగా కూడా తెలుగులో ఆమె ప్లస్ కాదు. అయితే తమిళంలో ఈ సినిమా బిజినెస్ కు  అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందంటున్నారు.

నయనతార ఉండటంతో సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన టీమ్..ఆమె సినిమాలకు ఓపినింగ్స్ రాకపోవటం చూసి షాక్ అయ్యారట. 

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగా పవర్‌ రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సౌత్‌ టాప్‌ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే  సైరా  సినిమాలోని ఆమె పాత్ర పేరును సిద్ధమ్మగా పరిచయం చేసి, లుక్‌ను కూడా రివీల్‌ చేశారు. 

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా 2019 సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కురెడీ అవుతున్న ఈ మూవీలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు జగపతిబాబు, సుధీప్‌, విజయ్‌ సేతుపతి, తమన్నా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Ananya Nagalla: డబ్బులు తీసుకుని వల్గర్ గా ఫోటోలు, సమాజ సేవ కోసమే.. నేను అలా కాదు అంటున్న అనన్య
Peddi Item Song : పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో రామ్ చరణ్ రొమాన్స్.. పాట కోసం కోటి డిమాండ్ చేస్తున్న బ్యూటీ ఎవరు?