మహిళ ఆటో డ్రైవర్‌ ను ఆదుకున్న ఐశ్వర్య రాజేష్‌, సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన డ్రైవర్‌ జమున

By Mahesh JujjuriFirst Published Dec 31, 2022, 2:14 PM IST
Highlights

యాక్టింగ్ లో టాలెంట్ ఉంటే చాలు.. గ్లామర్ పాత్రలే చేయాల్సిన అవసరం లేదు అని నిరూపించిన హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్ ఒకరు.  

హీరోయిన్ అంటే గ్లామర్‌ పాత్రలు మాత్రమే చేయాలి అని లేదు.. క్యారక్టర్ డిమాండ్ ను బట్టి.. పాత్రలకు, నటనకు ప్రాదాన్యత ఉన్నపాత్రలతో సినిమాలు చేసే హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. అవ్వడానికి తెలుగు అమ్మాయే అయినా.. చెన్నైలో పుట్టి పెరిగి.. తమిళ సినిమాలతో విపరీతమైన క్రేజ్ ను సంపాదించింది ఐశ్వర్య రాజేష్. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ తమళ సోయగం.. తెలుగులో కూడా క్రేజీ ఆఫర్లతో మంచిపేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో . ప్రస్తుతం ఈమె చేతిలో పది సినిమాలకు పైగా ఉన్నాయి. అందులో డ్రైవర్‌ జమున ఒకటి. 

పా.కిన్ల్సిన్‌ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి..పర్వాలేదు అనిపించింది.   మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈసినిమాలో  క్యాబ్‌ డ్రైవర్‌గా నటించి మెప్పించింది  ఐశ్వర్య. ఈసినిమాలో ఐశ్వర నటనకు  మంచి మార్కులు పడ్డయి.. కాని ఎంటర్టైన్మెంట్ తక్కువ అవ్వడం వల్ల సినిమా పెద్దగా ఆడలేదు. కానిమంచి మెసేజ్ మాత్రం ఇచ్చింది. 

ఇక ఈ సినిమా ప్రమోషన్‌లను మేకర్స్‌ పెద్ద ఎత్తున జరుపుతున్నారు.  కాగా ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్‌ మూవీ టీమ్ తో పాటుగా  మహిళా ఆటో డ్రైవర్‌లను కలిశారు. చెన్నై సహా ఇతర జిల్లాలకు చెందిన 40మంది ఆటోడ్రైవర్‌లను ప్రమోషన్‌లో భాగంగా పిలిచారు. కాగా ఈ నలభై మందిలో ఒకరిని ఎంపిక చేసి ఆమెకు ఆటోను బహుమతిగా ఇచ్చారు. ఆటో తాళం చెవిని ఐశ్వర్య  ఆ మహిళకు అందజేసింది. 

అనుకోకుండా జరిగిన ఈ సర్ ప్రైజ్ తో  ఆటో గెలుచుకున్న మహిళ సంతోషం తట్టుకోలేకపోయింది. ఇక డ్రైవర్‌ జమున టీమ్‌ చేసిన పనికి  పలువురు ప్రశంసిస్తున్నారు. 18 రీల్స్‌ బ్యానర్‌పై ఎస్‌.పి.చౌదరి ఈ సినిమాను నిర్మించాడు. అయితే ఈమూవీని త్వరలో తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ముందు తమిళం,తెలుగులో కూడా రిలీజ్ చేయాలి అని చూశారు. కాని కొన్ని కారణాల వల్ల ఈమూవీని తమిళంలో మాత్రమే రిలీజ్ చేశారు. 


 

click me!