ఉదయ్ కిరణ్, తరుణ్ మాదిరి మీ కెరీర్ కూడా.... వాళ్ళతో నన్ను పోల్చకండి

By team teluguFirst Published Jul 23, 2021, 8:32 AM IST
Highlights

ఇందువదన మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన పలు ఇంటర్వ్యూలు,ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో వరుణ్ ని యాంకర్ ఉదయ్ కిరణ్, తరుణ్ లతో పోల్చగా, వాళ్ళతో నన్ను పోల్చకండి అన్నారు. 

యంగ్ హీరో వరుణ్ సందేశ్ త్వరలో ఇందువందన చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. చాలా గ్యాప్ తరువాత వరుణ్సందేశ్ నుండి వస్తున్న ఈ చిత్రం కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన పలు ఇంటర్వ్యూలు,ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో వరుణ్ ని యాంకర్ ఉదయ్ కిరణ్, తరుణ్ లతో పోల్చగా, వాళ్ళతో నన్ను పోల్చకండి అన్నారు. 

ఉదయ్ కిరణ్, తరుణ్ మాదిరి మొదట్లో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని.. ఆ తర్వాత త్వరగా కెరీర్ లో గ్రాఫ్ పడిపోయిన హీరోల్లో మీరు కూడా ఒకరు, వాళ్ళతో మీకు పోలిక ఉందన్న అర్థంలో యాంకర్ అడిగారు. దానికి వాళ్లతో నాకు పోలికలేదు. ఉదయ్ కిరణ్, తరుణ్ ఇద్దరూ నాకు పర్సనల్ గా తెలుసు. ఉదయ్ కిరణ్ కి జరిగింది చాలా బాధాకరం. బిగ్ బాస్ షో తరువాత నేను కొన్ని ప్రాజెక్ట్స్ కి సైన్ చేశాను. అయితే కోవిడ్ కారణంగా అవి సెట్స్ పైకి వెళ్ళలేదు. 

సినిమాల నుండి గ్యాప్ వచ్చాక, సాఫ్ట్ వేర్ కోర్సులు, వ్యాపారాలు అంటూ కొంత సమయం కేటాయించాను, అని వరుణ్ సందేశ్ తెలిపారు. హ్యాపీ డేస్ మూవీతో వెండితెరకు పరిచయమైన వరుణ్ మొదటి చిత్రంతోనే భారీ విజయం అందుకున్నారు. ఆ తరువాత వరుణ్ నటించిన కొత్త బంగారు లోకం మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏమైంది ఈవేళ చిత్రంతో మరో హిట్ అందుకున్న వరుణ్ ఆ తరువాత వరుస పరాజయాలు చవిచూశారు. దీనితో ఆయన కెరీర్ ఇబ్బందుల్లో పడింది. 

click me!