కౌశల్ కి పవన్ తో పోలికేంటి..?

First Published 12, Sep 2018, 2:42 PM IST
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. అతడి ఫ్లాప్ సినిమాలకు సైతం భారీ వసూళ్లు వస్తుంటాయి. జనాల్లో పవన్ కి అంతటి ఫాలోయింగ్ ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ ని పోలుస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన కౌశల్ కోసం సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ రెడీ అయింది. ఇటీవల కౌశల్ కోసం ఈ ఆర్మీ 2కె రన్ కూడా నిర్వహించారు. అంతగా ప్రేక్షకాదరణ పొందాడు. అయితే కౌశల్ ఆర్మీపై బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గణేష్ కొన్ని కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరికి అభిమానులు ఉన్నారని కౌశల్ అభిమానులు స్పెషల్ ఏం కాదంటూ కొన్ని కామెంట్స్ చేశాడు.

గణేష్ చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ అతడిపై విరుచుకుపడుతోంది. గణేష్ కావాలని కౌశల్ ఆర్మీని టార్గెట్ చేస్తున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు. కత్తి మహేష్.. పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసి ఫేమస్ అయినట్లు ఈ గణేష్.. కౌశల్ పై కామెంట్స్ చేసి సెలబ్రిటీ అవుదామనుకుంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ కౌశల్ ని పవన్ కళ్యాణ్ తో పోల్చడం పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు కౌశల్ ని పవన్ తో పోలుస్తూ విమర్శలు చేయడం ఏంటని కౌశల్ ఆర్మీని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

బిగ్ బాస్2: కొడుకు పిలుపుతో కౌశల్ కన్నీళ్లు!

కౌశల్ ని బయటకి పంపడానికి పెద్ద ప్లానే వేశారు!

Last Updated 19, Sep 2018, 9:24 AM IST