హాట్ టాపిక్ గా డాలీ డిక్రూజ్ గాయత్రి మృతి.. షణ్ముఖ్ తో నటించిన షార్ట్ ఫిలిమ్స్ అన్నీ సూపర్ హిట్

హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో 27 ఏళ్ల జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి మరణం అందరిని కలచి వేస్తోంది. చిత్ర పరిశ్రమని విషాదంలోకి నెట్టింది. ఎంతో భవిష్యత్తు ఉన్న గాయత్రి గచ్చిబౌళి ప్రాంతంలో తన స్నేహితుడు రోహిత్ తో కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది.

Dolly D Cruz aka Gayathri death became hot topic in tollywood

హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో 27 ఏళ్ల జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి మరణం అందరిని కలచి వేస్తోంది. చిత్ర పరిశ్రమని విషాదంలోకి నెట్టింది. ఎంతో భవిష్యత్తు ఉన్న గాయత్రి గచ్చిబౌళి ప్రాంతంలో తన స్నేహితుడు రోహిత్ తో కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయత్రి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. 

దీనితో ప్రస్తుతం గాయత్రి మరణం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గాయత్రి కారు కారు ప్రమాదానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. రోహిత్ కారు డ్రైవ్ చేశాడని, అతడి పక్క సీట్ లో గాయత్రి కూర్చుందని అంటున్నారు. మద్యం సేవించడం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు. 

Latest Videos

వీరి కారులో మద్యం కలిపి ఉన్న కొబ్బరి బొండాలు దొరినట్లు కూడా తెలుస్తోంది. వీరిద్దరూ శుక్రవారం హోలీ సందర్భంగా ప్రిసం పబ్ కి వెళ్లారు అని తిరిగి వెళ్లే క్రమంలో కారు అతి వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు సిసి టీవీ ఫుటేజ్ ద్వారా తేల్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 100-120 కిమీ వేగంతో ప్రయాణిస్తోందని మాదాపూర్ పోలీసులు మీడియాకు తెలిపారు.  కారు ఫుట్ పాత్ ని ఢీ కొట్టడంతో ముందు టైర్లు ఊడిపోయాయి. క్షణాల్లో కారు పల్టీలు కొడుతూ దూరంగా పడింది. అద్దాలు పగిలిపోవడంతో గాయత్రీ కారులో నుంచి రోడ్డుపై పడి మృతి చెందినట్లు పోలీసులు తెలుపుతున్నారు. 

గాయత్రి యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది . బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ తో కలసి గాయత్రి వెబ్ సిరీస్ లో కూడా నటించింది. 3 మస్కిటోస్, సాఫ్ట్ వేర్ పెళ్లి చూపులు, 3.ఓ లాంటి షార్ట్ ఫిలిమ్స్ గాయత్రికి గుర్తింపు తీసుకువచ్చాయి. ఆమె నటించిన ప్రతి షార్ట్ ఫిలిం కి యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ వచ్చేవి. గాయత్రి మృతితో షణ్ముఖ్ కూడా దిగ్బ్రాంతికి గురయ్యాడు. అలాగే గాయత్రికి సురేఖ వాణితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. 

vuukle one pixel image
click me!