`ప్రాజెక్ట్ కే` అసలు మీనింగ్‌ ఇదేనా?.. క్రేజీ అప్‌డేట్‌ చక్కర్లు.. ప్రభాస్‌ ఫ్యాన్స్ కి పండగలాంటి వార్తే?

Published : Apr 03, 2023, 10:22 PM IST
`ప్రాజెక్ట్ కే` అసలు మీనింగ్‌ ఇదేనా?.. క్రేజీ అప్‌డేట్‌ చక్కర్లు.. ప్రభాస్‌ ఫ్యాన్స్ కి పండగలాంటి వార్తే?

సారాంశం

సూపర్‌ హీరో నేపథ్యంలో యుద్ధ వీరుల కథతో సినిమా సాగుతుందనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇందులో పౌరాణిక, ఇతిహాసాల అంశాలుంటాయని అంటున్నారు. ఇంకోవైపు హాలీవుడ్‌ సూపర్‌ హీరోల కథని పోలి ఉంటుందని అంటున్నారు. 

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నుంచి రాబోతున్న ఇంటర్నేషనల్‌ రేంజ్‌ ఉన్న మూవీ `ప్రాజెక్ట్ కే`. నాగ్‌ అశ్విన్‌ దీన్ని సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి భారీ తారాగణం నటిస్తుంది. వీరితోపాటు మరికొన్ని సర్‌ప్రైజింగ్‌ క్యారెక్టర్లు ఉంటాయని తెలుస్తుంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై సుమారు రూ.500కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత అశ్వినీదత్‌. 

సూపర్‌ హీరో నేపథ్యంలో యుద్ధ వీరుల కథతో సినిమా సాగుతుందనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇందులో పౌరాణిక, ఇతిహాసాల అంశాలుంటాయని అంటున్నారు. ఇంకోవైపు హాలీవుడ్‌ సూపర్‌ హీరోల కథని పోలి ఉంటుందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లలో ఓ వైపు పౌరాణికత, మరోవైపు లేటెస్ట్ ట్రెండ్‌ కనిపిస్తుంది. భూత, భవిష్యత్‌ కాలాల మేళవింపుగా, టైమ్‌ ట్రావెల్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. కానీ ఈ కథపై ఇప్పటి వరకు ఓ క్లారిటీ లేదు. అదే సమయంలో `ప్రాజెక్ట్ కే` అనేదానిపై కూడా క్లారిటీ లేదు. `ప్రాజెక్ట్‌ ఏంటీ, కే ఏంటీ అనే సందేహాలు కలుగుతున్నాయి. 

తాజాగా ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. `ప్రాజెక్ట్ కే`లో కే మీనింగ్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. ఇందులో కే అంటే `కృష్ణుడు`, లేదంటే `కర్ణ` అని తెలుస్తుంది. అయితే దర్శకుడు ఈ సినిమాని ఒక్కదానితోనే క్లోజ్‌ చేయకుండా ఓ సిరీస్‌లా తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఏడెనిమిది సినిమాలుగా వరుసగా తెరకెక్కించాలనుకుంటున్నారట. అయితే ఒక్కో పాత్రకి ఒక్కో హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఒక్కో పార్ట్ ని ఒక్కో పాత్రతో, అందుకు తగ్గట్టుగా మరో హీరోతో ఈ సినిమాని తెరకెక్కించాలనుకుంటున్నారట. లాంగ్‌ రన్‌లో ఈ సినిమాని హాలీవుడ్‌ ఫ్రాంఛైజీల మాదిరిగా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. 

ఇందులో ప్రభాస్‌ ఎలాంటి పాత్ర చేస్తున్నారనేది పెద్ద సస్పెన్స్. చిత్ర బృందం రివీల్‌ చేయడం లేదు. సినిమాకి సంబంధించి ప్రతిదీ గోప్యతని మెయింటేన్‌ చేస్తున్నారట. ఆయనకు జోడీగా దీపికా, దిశా పటానీ కథానాయికగా నటిస్తున్నారు. అమితాబ్‌ ది చాలాకీలక మైన పాత్ర అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు