నార్త్ లో డల్‌గా `దసరా` కలెక్షన్లు.. నాని రియాక్షన్‌ ఏంటంటే?.. థియేటర్‌ లెక్కలపై ఆసక్తికర వ్యాఖ్యలు..

Published : Apr 03, 2023, 08:30 PM IST
నార్త్ లో డల్‌గా `దసరా` కలెక్షన్లు.. నాని రియాక్షన్‌ ఏంటంటే?..  థియేటర్‌ లెక్కలపై ఆసక్తికర వ్యాఖ్యలు..

సారాంశం

హీరో నాని ఇటీవల `దసరా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమా మంచి కలెక్షన్లతో రన్‌ అవుతుంది. కానీ నార్త్ లో డల్‌ గా ఉందనే టాక్ వస్తుంది. దీనిపై నాని రియాక్ట్ అయ్యాడు. 

నాని హీరోగా నటించిన `దసరా` చిత్రం శ్రీరామనవమి పండుగ సందర్భంగా విడుదలై ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. సినిమా పరంగా మిక్డ్స్ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా ఈ సినిమా సత్తా చాటుతుంది. తెలుగు రాష్ట్రల్లో ఓవర్సీస్‌లో బెస్ట్ కలెక్షన్లని రాబడుతుంది `దసరా`. ముఖ్యంగా తెలంగాణ రచ్చ చేస్తుంది. ఈ సినిమా ఇప్పటి వరకు ఎనభై కోట్లకుపైగా గ్రాస్‌ సాధించింది. యాభై కోట్ల షేర్‌కి దగ్గరలో ఉంది. థియేట్రికల్‌గా ఈ చిత్రం ఆల్మోస్ట్ బ్రేక్‌ ఈవెన్‌ కాబోతుంది. 

కానీ నార్త్ లో, సౌత్‌లో మాత్రం ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేవు. నార్త్ లో మూడు కోట్లకి రీచ్‌ అయ్యింది. కానీ ఆశించిన స్థాయిలో లేవనే టాక్‌. ఉంది. దీనిపై నాని స్పందించారు. నార్త్ లో డల్‌గా ఉండటంపై ఆయన రియాక్ట్ అవుతూ అసలు నార్త్ లో తానేవరో ఎవరికీ తెలియదని, సినిమా బాగుందనే టాక్‌తోనే వెళ్తున్నారని, అక్కడ ఎంత వచ్చినా సక్సెసే అని తెలిపారు. అక్కడ ఒక్క టికెట్‌ తెగినా మేం సక్సెస్‌ అయినట్టే అని, ఇప్పుడు మూడు కోట్లకు చేరుకుందని అందుకు చాలా హ్యాపీ అని తెలిపింది. అయితే మొదటి రోజుతో పోల్చితే కలెక్షన్ల గ్రాఫ్‌ పెరుగుతుందని, నెమ్మదిగా మౌత్‌ టాక్‌తో ఆదరణ పెరుగుతుందన్నారు. 

అలాగే సౌత్‌లోనూ తనకు పెద్దగా గుర్తింపు లేదని, అయినా ఆ స్థాయిలో కలెక్షన్లు రావడం గొప్పే అన్నారు. తమ లక్ష్యం తెలుగు స్టేట్సే అని, ఇక్కడ అనుకున్నదానికంటే ఎక్కువగానే కలెక్షన్లు వస్తున్నాయని చెప్పారు నాని. ఈ సందర్బంగా సినిమాల కలెక్షన్లపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని పెద్ద సినిమాలు, పెద్ద హిట్ సినిమాలు తప్పితే, చాలా సినిమాలకు ఇప్పుడు రెవెన్యూ డిజిటల్‌ అన్నారు. థియేట్రికల్‌గా పెద్ద బడ్జెట్‌కి రికవరీ కావడం లేదని, అందులో సగం వరకే ఉంటుందని, మిగిలినది ఓటీటీలు, శాటిలైట్‌ ద్వారా నిర్మాతలకు రికవరీ అవుతున్నాయని, థియేటర్‌ నుంచి పెద్ద కలెక్షన్లని నిర్మాతలు కూడా ఆశించడం లేదన్నారు. ఒకవేళ వస్తే అవి భోనస్‌గా ఉంటున్నాయని, ఇప్పుడు ఓటీటీ వచ్చాక నిర్మాతలు చాలా వరకు సేఫ్‌లో ఉంటున్నారని తెలిపారు నాని. 

తన కంఫర్ట్ జోనర్‌ నుంచి బయట పడినట్టేనా అనే ప్రశ్నకి నాని స్పందిస్తూ, `ఏ  జోనర్ ని కూడా రిపీట్ చేయకపోవడాన్ని  కంఫర్ట్ గా ఫీలౌతా. చేసింది మళ్ళీ చేయకూడదు. మళ్ళీ రెండుముడేళ్ళ తర్వాత సాలిడ్ మాస్ ఫిల్మ్ తో వస్తా. కానీ అలా చేయాలని కాదు. ఒక నటుడిగా కొత్తగా చేయాలని వుంటుంది. ఇది వర్క్ అవుట్ అవుతుందని అదే అమ్మాలని చూస్తే బిజినెస్ మెన్ అవుతాను కానీ యాక్టర్ ని కాదు కదా` అని వెల్లడించారు. ఇక నాని.. బిఫోర్ `దసరా` ఆఫ్టర్ `దసరా` అనే కామెంట్లపై స్పందిస్తూ, `ఇది నేను చాలా సార్లు విన్నాను. `భలే భలే మగాడివో`, `జెర్సీ`, `నిన్ను కోరి` సినిమాలకి విన్నాను. ఇప్పడు `దసరా`కి అంటున్నారు. ఇదే మాట నేను మున్ముందు కూడా చాలా సినిమాలకు వినాలని కోరుకుంటున్నా` అని చెప్పారు నాని. 

ఇక `దసరా` ఈ నాలుగు రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.83కోట్ల గ్రాస్‌ చేసింది. ఏపీ, తెలంగాణలో 56కోట్లు, తమిళనాడులో రెండు కోట్లు, కేరళాలో నలభై లక్షలు, కర్నాటకలో ఐదు కోట్లు, హిందీలో మూడు కోట్లు, ఓవర్సీస్‌లో ఏకంగా రూ.17కోట్లు రాబట్టింది. ఇలా 83కోట్ల గ్రాస్‌, 47కోట్ల షేర్‌ సాధించింది. ఈ సినిమా యాభై కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిన విషయం తెలిసిందే. నేటితో బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఆల్మోస్ట్ పెట్టిన బడ్జెట్‌ వచ్చేసిందనే చెప్పాలి. డిజిటల్‌ రైట్స్ ద్వారా వచ్చినవి నిర్మాతలకు లాభాలు మిగిల్చబోతున్నాయని చెప్పొచ్చు. నాని హీరోగా, శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో రూపొందిన `దసరా` చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటించింది. మార్చి 30న సినిమా విడుదలైన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు