ఆ స్టార్ హీరో హనుమాన్ డైరెక్టర్ ని అవమానించాడా? సంచలనంగా సోషల్ మీడియా కామెంట్ 

By Sambi ReddyFirst Published Jul 8, 2024, 7:26 PM IST
Highlights


హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్ చర్చకు దారి తీసింది. ఓ స్టార్ హీరో ఆయన్ని అవమానించాడని, అందుకే అలాంటి కామెంట్ చేశాడన్న వాదన వినిపిస్తోంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో చూద్దాం.. 
 

కెరీర్ బిగినింగ్ నుండి భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన తెరకెక్కించిన అ, కల్కి, జాంబిరెడ్డి డిఫ్రెంట్ జోనర్స్ లో తెరకెక్కాయి. ఇక హనుమాన్ మూవీతో భారతీయ చలన చిత్ర పరిశ్రమ తనవైపు తిరిగి చూసేలా చేశాడు. తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన విజువల్స్ అందించిన ప్రశాంత్ వర్మ ప్రతిభను సినీ ప్రముఖులు, ప్రేక్షకులు కొనియాడారు. 

2024 సంక్రాంతి విన్నర్ గా నిలిచిన హనుమాన్ రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఊహించని పరిణామం. తేజా సజ్జా వంటి యంగ్ హీరోతో ప్రశాంత్ వర్మ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. హనుమాన్ సక్సెస్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. కాగా ఓ బాలీవుడ్ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాల్సింది. దాదాపు ఓకే అయిన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. రణ్వీర్ సింగ్-ప్రశాంత్ వర్మ కాంబోలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కాల్సింది. 

Latest Videos

ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ మూవీ రద్దైనట్లు టాలీవుడ్ టాక్. తాజాగా ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా అకౌంట్ వేదికగా ఓ కామెంట్ చేశాడు. 'ప్రతి తిరస్కరణ ఆశీర్వాదమే అని నీకు ఒక రోజు తెలిసి వస్తుంది'  అని కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ ప్రశాంత్ వర్మ హీరో రణ్వీర్ సింగ్ ని ఉద్దేశించి చేశాడు. ఆయన ప్రశాంత్ వర్మను అవమానించాడు. అందుకే ఇలా ప్రశాంత్ వర్మ రియాక్ట్ అయ్యాడనే వాదన మొదలైంది. 

ప్రశాంత్ అలాంటి కామెంట్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో కానీ... రణ్వీర్ సింగ్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రశాంత్ వర్మ హనుమాన్ 2 ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హనుమాన్ గా ఓ స్టార్ హీరో నటిస్తారని ఆయనే చెప్పారు. తేజా సజ్జా ఒకవేళ నటించినా ఆయనది ప్రధాన పాత్ర కాదంటున్నారు. అలాగే బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకుడు అనే ప్రచారం జరుగుతుంది.. 

One day you realise every rejection was a blessing in disguise! :)

— Prasanth Varma (@PrasanthVarma)
click me!