ఒకేసారి `గేమ్‌ ఛేంజర్‌`, `ఇండియన్‌2` షూటింగ్‌లు.. క్వాలిటీపై ప్రభావం.. శంకర్‌ రియాక్షన్‌ మైండ్‌ బ్లోయింగ్..

By Aithagoni RajuFirst Published Jul 8, 2024, 6:01 PM IST
Highlights

`ఇండియన్‌ 2`, `గేమ్‌ ఛేంజర్‌` సినిమాలు ఒకేసారి రూపొందించడంపై దర్శకుడు శంకర్‌ స్పందించారు. రెండుపార్ట్ లుగా తీసుకురావడానికి సంబంధించిన కూడా ఆయన వివరణ ఇచ్చారు.
 

దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం `ఇండియన్‌ 2` సినిమాని రూపొందించారు. కమల్‌ హాసన్‌ హీరోగా, సిద్ధార్థ్‌, రకుల్ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌ జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో టీమ్‌ ముచ్చటించింది. ఇందులో `ఇండియన్‌ 2` రెండు భాగాలు చేయడానికి కారణాలు తెలిపారు. సినిమా ఒక పార్ట్ చేయాలనే ప్రారంభించాం. అలానే షూట్‌ చేశాం. ఎడిటింగ్‌ కోసం కూర్చున్నప్పుడు సినిమా లెన్త్ పెరిగిపోయింది. చాలా సీన్లు బాగా వచ్చాయి. అద్భుతంగా ఉన్నాయి. ఏ సీన్ తీసినా కథ డిస్‌ కనెక్ట్ అయ్యేలా ఉంది. 

`గోరు పెరిగితే కట్‌ చేయగలం, కానీ ఫింగర్‌ని కట్‌ చేయలేం కదా`. అలానే ఈ కథ కూడా. అందుకే రెండు భాగాలుగా చేయాల్సి వచ్చింది. అందులో కమర్షియల్‌ కోణం లేదు అని వెల్లడించారు శంకర్‌. అంతేకాదు శంకర్‌ ఒకేసారి రామ్‌ చరణ్‌తో `గేమ్‌ ఛేంజర్‌`, కమల్‌ హాసన్‌తో `ఇండియన్‌ 2` చిత్రాలు రూపొందించారు. ఓకేసారి రెండు సినిమాలు చేయడంపై రియాక్ట్ అవుతూ, పక్కా ప్లాన్ ప్రకారమే షూటింగ్‌లు చేశామని తెలిపారు. కరోనా సమయంలోనే రెండు స్క్రిప్ట్ లకు సంబంధించిన సీన్‌ బై సీన్‌ షాట్‌ డివిజన్‌ చేసుకున్నామని, ఎలాంటి కన్‌ ఫ్యూజన్‌ లేదు. అన్నీ పక్కాగా ప్లాన్‌ చేసుకునే షూటింగ్‌ చేసినట్టు తెలిపారు శంకర్‌. 

Latest Videos

ఒకప్పుడు డైరెక్టర్స్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేసేవారు. మార్నింగ్ షిఫ్ట్ ఓ సినిమా, మధ్యాహ్నం మరో సినిమా షూటింగ్‌లో పాల్గొనే వారు. అంతా పక్కాగా మేం ప్లాన్‌ చేసుకునే షూటింగ్‌ చేస్తామని, ఆ విషయంలో కన్‌ ఫ్యూజన్‌ లేదు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ భరోసా ఇస్తున్నానని అని తెలిపారు శంకర్‌. ఈ విషయంలో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ దాసరినారాయణ రావు గారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన ఒకే రోజు రెండు మూడు సినిమాల షూటింగ్‌లు చేసేవారని, మార్నింగ్‌ టిఫిన్‌ చేసి ఓ సినిమా షూటింగ్‌కి, లంచ్‌ చేసి మరో సినిమా షూటింగ్‌కి, డిన్నర్‌ అయ్యాక నైట్‌ ఇంకో సినిమాని తీసేవారు. ఏడాది ఆరేది సినిమాలను రిలీజ్‌ చేసేవారు, బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లు కొట్టారు అని తెలిపారు కమల్‌. శంకర్‌ ఆ విషయంలో ఫుల్‌ క్లారిటీతో ఉంటారని, ఆయన విజన్‌ చాలా పెద్దది అని చెప్పారు. 

`ఇండియన్‌ 2` సినిమా సమకాలీన అంశాల సమాహారంగా ఉంటుందని, నేటి యువతకు కూడా కనెక్ట్ అవుతుందన్నారు. కేవలం కమర్షియల్‌ యాంగిల్‌ మాత్రమే కాదు, సినిమాలో మంచి సందేశం ఉందని, అది అందరిని ఆలోచింప చేస్తుంది. సినిమా చూసి ఇంటికెళ్లేటప్పుడు ఒక ఆలోచనతో, ఆవేశంతో ఇంటికెళ్తారని తెలిపారు శంకర్‌. 
 

click me!