DJ Tillu: ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతైందో తెలిస్తే షాక్ అవుతారు

Surya Prakash   | Asianet News
Published : Feb 12, 2022, 08:19 AM IST
DJ Tillu: ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతైందో తెలిస్తే షాక్ అవుతారు

సారాంశం

 'నెక్స్ట్ ఇయర్ బన్నీ మూవీతో లాంచ్ అవుతున్న నేను' అనే డైలాగ్‌తో డీజే టిల్లు ట్రైలర్‌ మొదలై.. 'ఒకడిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా, బనియన్‌కు తెలియకుండా డ్రాయర్ లాగేయాల' అనే డైలాగ్‌తో ఎండ్ అవుతుంది. ట్రైలర్‌ మొత్తం కామిడీ డైలాగులతో నవ్వులు పూయిస్తోంది.


ఈ మధ్యకాలంలో పెద్ద క్రేజ్ తెచ్చుకున్న చిన్న సినిమా డీజే టిల్లు. ఈ రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు పాజిటివ్ బజ్ నడుస్తోంది. అలాగే ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా మంచి ఆదరణపొందాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో సిద్ధూ యాటిట్యూడ్, హీరోయిన్ అందచందాలు  జనాల్లోకి వెళ్లిపోయాయి. మాస్ అంశాలతో పాటు రొమాంటిక్ ఎలిమెంట్స్ తో  ట్రైలర్‌ను కట్ చేయడంతో ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. యూత్ ఎక్కువగా ఉండే సోషల్ మీడియాలో ఈ సినిమాపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే వచ్చిన యుఎస్ టాక్ ని బట్టి ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్ చూద్దాం.
 
 
అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.
నైజాంలో 2.80 కోట్లు,
సీడెడ్‌లో 1.50 కోట్లు,
ఆంధ్రాలో 3.40 కోట్లు,
మొత్తంగా ఏపీ తెలంగాణలో 7.70 కోట్లు
 కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.60 కోట్లు
 ఓవర్సీస్ 0.65 కోట్లు

  ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా 8.95 కోట్లుకు బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే కనీసం 9.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ సాధించాలి.

ప్లస్ ల విషయానికి వస్తే.... టైటిల్ సాంగ్ డీజే టిల్లు పాటకు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది.  యూత్ ని బాగా అట్రాక్ట్ చేసిన ఈ ట్రైలర్ ఒక్క రోజులోనే 4.2 మిలియన్ వ్యూస్‌ని దాదాపు రెండు లక్షల వరకు లైక్స్ ని అందుకుంది. తెలంగాణ యాసలో సిద్ధు జొన్నలగడ్డ ఇరగదీశారు.

రొమాంటిక్ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ ఈ ట్రైలర్ ని కట్ చేయించారు. సిద్ధూ స్నేహాల మధ్య సీన్స్ కూడా డైలాగ్స్ అన్ని కూడా యూత్ ని టార్గెట్ చేసే  విధంగా కాస్త బూతు మిక్స్ చేసే ఉన్నాయి. నిజానికి సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది కానీ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది.  'నెక్స్ట్ ఇయర్ బన్నీ మూవీతో లాంచ్ అవుతున్న నేను' అనే డైలాగ్‌తో డీజే టిల్లు ట్రైలర్‌ మొదలై.. 'ఒకడిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా, బనియన్‌కు తెలియకుండా డ్రాయర్ లాగేయాల' అనే డైలాగ్‌తో ఎండ్ అవుతుంది. ట్రైలర్‌ మొత్తం కామిడీ డైలాగులతో నవ్వులు పూయిస్తోంది.

  'మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు', 'నేను నిన్ను బోల్ హాటెడ్‌గా లవ్ జేసిన రాధిక', 'తెలిసే అవులగాన్ని జేస్తున్నావ్ నువ్ నన్ను.. సో స్వీట్ అఫ్ యూ'. 'ఆ పెడుతారు నోట్ల పెద్ద ముద్ద', 'ఒకడిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా, బనియన్‌కు తెలియకుండా డ్రాయర్ లాగేయాల' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సిద్ధు, నేహా శెట్టి మధ్య సాగే రొమాంటిక్‌ సీన్స్‌ యువతను పిచ్చేక్కించేలా ఉన్నాయి.

 సినిమాలో రామ్ మిర్యాల పాడిన  (DJ Tillu )డీజే టిల్లు సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను శ్రీచరణ్‌ పాకాలతో కలిసి రామ్‌ మిర్యాల  స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వస్తోంది. PDV ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. థమన్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం