
రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘డీజే టిల్లు’తో సిద్ధు జొన్నలగడ్డ స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం యూత్ ను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 12 రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిసింది. పెద్ద సినిమాల సందడి నెలకొన్న తరుణంలోనూ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. ఇప్పటికీ ఈ చిత్రంలోని డైలాగ్స్, సాంగ్స్ ట్రెండ్ లోనూ ఉంటున్నాయి. అంతటి ఫేమ్ ను దక్కించుకున్న సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రస్తుతం అప్ కమింగ్స్ ఫిల్మ్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే సిద్ధుతో సినిమా చేస్తానంటూ మంత్రి మల్లారెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చినా రిజెక్ట్ చేశాడంట.. ఇంతకీ ఏం జరిగిందంటే.
ఈ ఏడాది మే1న సినీ రంగ కార్మికులు మేడే ఉత్సవాలను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi), తెలంగాణ కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ వేదికపై మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ‘చిరంజీవి అన్న ఇప్పటి నుంచి నేను నీకు తోడవుతాను. త్వరలో నేను వెబ్ సిరీస్, సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తాను. మీకోసమో.. నాకోసమే కాదు.. కార్మికుల కోసం’ అని చెప్పుకొచ్చారు.
అయితే ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాను ప్రోడ్యూస్ చేయాలనే ఆలోచనల ఆయనలో మెదులుతూనే ఉంది. దీంతో DJ Tillu తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డతో సినిమా తీయాలనుకున్నాడు. వెంటనే సిధ్దును రప్పించుకొని విషయం చెప్పాడు. కానీ సిద్ధు ప్రస్తుతం రెండేండ్ల వరకు చాలా బిజీగా ఉన్నాడని, ఇప్పట్లో మాట ఇవ్వలేనని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోమాటగా ఆ తర్వాత కూడా కష్టమేనన్నారు. అయినా మంత్రి ‘డీజే టిల్లు’ సీక్వెన్స్ ను ప్రొడ్యూస్ చేసేందుకు అవకావం ఇవ్వాలని అడిగారంట. ఇందుకు కూడా జొన్నలగడ్డ నో చెప్పారంట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట చర్చగా మారింది.