చనిపోయే ముందు రాత్రి దిశా చిందులు.. వీడియో వైరల్‌

Published : Aug 08, 2020, 07:10 PM IST
చనిపోయే ముందు రాత్రి దిశా చిందులు.. వీడియో వైరల్‌

సారాంశం

తాజాగా దిశ తన స్నేహితులతో కలిసి పార్టీలో సంతోషంగా డాన్స్‌ చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో దిశ తన స్నేహితులతో ఓ హిందీ సినిమా పాటకు సరదాగా చిందులు వేశారు. 

రియా ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ పార్టీలో పాల్గొన్న విషయం తెలిసిందే. జూన్‌ తొమ్మిది రాత్రి, ముంబైలోని మ‌లాద్ ప్రాంతంలోని ప్రియుడు రోహాన్ నివాసం ఉందని, దిశ త‌న బాయ్‌ఫ్రెండ్‌తో పాటు‌‌, మ‌రికొంత‌మంది స్నేహితు‌లతో క‌లిసి పార్టీ చేసుకుందని, మ‌ద్యం ఎక్కువ‌గా తాగిన ఆమె ఏడుస్తూ తనని ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతూ ఆత్మహత్యకి పాల్పడిందనే విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే సుశాంత్‌, దిశ ఆత్మహత్యకు పాల్పడటంతో వీరిద్దరి మృతికి ఏదైన సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తాజాగా దిశ తన స్నేహితులతో కలిసి పార్టీలో సంతోషంగా డాన్స్‌ చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో దిశ తన స్నేహితులతో ఓ హిందీ సినిమా పాటకు సరదాగా చిందులు వేశారు. ఇందులో దాదాపు ఏడుగురు ఉన్నారు. వీరిలో దిశతోపాటు మరో ముగ్గురు డాన్స్ చేస్తుండగా, ముగ్గురు సోఫాలో కూర్చొని సాంగ్‌ని తిలకిస్తున్నారు. 

ఇంత జాలీగా గడిపిన దిశా నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దిశా సలియన్‌ మృతి కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తూ.. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం, ఆధారాలు తెలిసినా తమకు ఆ వివరాలు అందించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీనిపై దిశా స‌లియాన్ స్నేహితురాలు ఒకరు ఇటీవల స్పందిస్తూ, జూన్‌ తొమ్మిది రాత్రి, ముంబైలోని మ‌లాద్ ప్రాంతంలోని ప్రియుడు రోహాన్ నివాసం ఉందని, దిశ త‌న బాయ్‌ఫ్రెండ్‌తో పాటు‌‌, మ‌రికొంత‌మంది స్నేహితు‌లతో క‌లిసి పార్టీ చేసుకుందని, మ‌ద్యం ఎక్కువ‌గా తాగిన ఆమె ఒక్క‌సారిగా ఏడుస్తూ వాగిందని తెలిపింది. 

దీంతో అక్క‌డ ఉన్న‌ ఓ స్నేహితుడు పార్టీ నాశ‌నం చేయొద్ద‌ని చెప్పడంతో ఆమె త‌న‌ బెడ్‌రూంలోకి వెళ్లి గ‌డియ పెట్టుకుందని, ఎంత‌సేప‌టికీ తిరిగి రాక‌పోవ‌డంతో ఆమె
ప్రియుడు, ఇత‌ర మిత్రులు వెళ్లి త‌లుపు త‌ట్టారు. రూమ్‌లో లేకపోవడంతో బయట చూడగా, ఆమె బాల్క‌నీలో నుంచి దూకి మెట్ల‌పై ప‌డిపోయి క‌నిపించిందని, ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయిందని తెలిపింది. ఇలా ఓ వైపు సుశాంత్‌ కేసు, మరోవైపు దిశా కేసులు రోజుకో మలుపు తీసుకుంటూ ఉత్కంఠతకు గురి చేస్తున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్