నువ్వు ఎందుకు ఓకే చెప్పావ్.. శ్రీరెడ్డిపై డిస్కో శాంతి ఫైర్!

Published : Aug 17, 2018, 04:59 PM ISTUpdated : Sep 09, 2018, 12:20 PM IST
నువ్వు ఎందుకు ఓకే చెప్పావ్.. శ్రీరెడ్డిపై డిస్కో శాంతి ఫైర్!

సారాంశం

కాస్టింగ్ కౌచ్, మహిళల వేధింపులు అన్ని చోట్ల జరుగుతున్నాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండకూడదు. వెంటనే ప్రతిఘటించాలని చెబుతూ శ్రీరెడ్డిపై కొన్ని కామెంట్స్ చేశారు

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయంలో పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి రీసెంట్ గా కోలీవుడ్ కి వెళ్లి అక్కడి ప్రముఖులను కూడా టార్గెట్ చేసింది. అయితే దాదాపు ఇండస్ట్రీలో అందరూ కూడా శ్రీరెడ్డిని వ్యతిరేకిస్తూ ఆమెపై కేసులు పెట్టారు. కాస్టింగ్ కౌచ్ పై స్పందించేవారు కూడా శ్రీరెడ్డి వ్యవహారాలను తప్పుబడుతూ దూషించారు. తాజాగా నటి డిస్కో శాంతి కూడా ఈ విషయంపై స్పందించింది.

'కాస్టింగ్ కౌచ్, మహిళల వేధింపులు అన్ని చోట్ల జరుగుతున్నాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండకూడదు. వెంటనే ప్రతిఘటించాలని' చెబుతూ శ్రీరెడ్డిపై కొన్ని కామెంట్స్ చేశారు. 'మగాడు వచ్చి నీ నుండి ఏదో ఆశిస్తున్నప్పుడు నువ్వు కుదరదని చెప్పాలి. నువ్వు ఎందుకు ఓకే చెప్పావు. మగాడు బలవంతంగా తీసుకొని వెళ్తే నేరం. నువ్వు ఇష్టపడి  వెళ్లి ఏం చేస్తున్నావ్.. అడిగినప్పుడే ఒకటి కొడితే మళ్లీ నీ జోలికి రారు కదా.. అంతా జరిగిపోయిన తరువాత నిందిస్తూ మాట్లాడడం సరి కాదు. మీడియాలో హైలైట్ కావడానికే ఇలా చేసి ఉండొచ్చు' అంటూ వ్యాఖ్యలు చేసింది.

ఇక ఇండస్ట్రీలో తనకి అలాంటి అనుభవం ఎప్పుడు ఎదురుకాలేదని, ఒకవేళ నాతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే అక్కడే చంపేసి ఉండేదాన్ని అంటూ ఘాటుగా స్పందించింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి