
పూజా హెగ్డే కెరీర్ త్రివిక్రమ్ సినిమాలకు ముందు ఆ తర్వాత అని చెప్పాలి. ఒక లైలా, ముకుంద చిత్రాలతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పూజా హెగ్డేకు సరైన హిట్ తగల్లేదు. హృతిక్ రోషన్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ఆఫర్స్ ఇచ్చినా ఆమె దశ మారలేదు. దువ్వాడ జగన్నాథం చిత్రం తర్వాత ఆమె రంగస్థలంలో ఐటెం సాంగ్ చేశారు. అంటే ఆమె కెరీర్ క్లోజింగ్ స్టేజ్ కి చేరుకుందని చెప్పొచ్చు. రంగస్థలం అనంతరం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జంటగా నటించిన సాక్ష్యం డబుల్ డిజాస్టర్.
ఈ టైం లో ఆమెకు ఎన్టీఆర్ వంటి స్టార్ సినిమాలో ఛాన్స్ వస్తుందని ఎవరూ ఊహించరు. ఐరన్ లెగ్ ఇమేజ్ తో దర్శక నిర్మాతలను భయపెడుతున్న పూజా హెగ్డేకు త్రివిక్రమ్ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఎన్టీఆర్ తో జతకట్టే బంపర్ ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా కథలో ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ రోల్. పూజా హెగ్డేని తీసుకుని త్రివిక్రమ్ రిస్క్ చేశాడు. ఎన్టీఆర్ మూవీ విజయం ఆయనకు కూడా చాలా అవసరం. అజ్ఞాతవాసి మూవీతో ఆయన ఇమేజ్ భారీగా డామేజ్ అయ్యింది.
అరవింద సమేత హిట్ టాక్ తెచ్చుకొని పూజాకు ఊపిరి పోసింది. దర్శక నిర్మాతలు ఆమె వైపు చూసేలా చేసింది. మళ్ళీ ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. అరవింద సమేత అనంతరం చేసిన మహర్షి చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించలేదు. జస్ట్ హిట్ అని చెప్పాలి. మహేష్ తో పూజా కెమిస్ట్రీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. హీరోయిన్ కి అంత స్కోప్ ఉన్న కథ కాకపోవడంతో పూజాకు స్క్రీన్ స్పేస్ కూడా తక్కువే.
కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో త్రివిక్రమ్ మళ్ళీ లిఫ్ట్ ఇచ్చారు. వరుసగా రెండోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అల వైకుంఠపురంలో మూవీతో ఆమెకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఈ చిత్ర విజయం పూజాకు డబుల్ మైలేజ్ ఇచ్చింది. ఆమెను స్టార్స్ లిస్ట్ లో చేర్చింది. కానీ పరిస్థితి మాత్రం మారలేదు. 2022లో పూజా నటించిన ఐదు చిత్రాలు ప్లాప్. రాధే శ్యామ్, ఆచార్య ఆల్ టైం డిజాస్టర్స్ అయ్యాయి.
దీంతో పూజాను హీరోయిన్ గా తీసుకోవాలంటే భయపడే పరిస్థితి. ఉస్తాద్ భగత్ సింగ్ లో మొదట పూజానే అనుకున్నారు. ఆమె ట్రాక్ చూసి పక్కన పెట్టి శ్రీలీలకు ఆఫర్ ఇచ్చారు. ఇక హిందీలో చేస్తున్న కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రం మీద ఆశలు లేవు. సల్మాన్ లుక్, సాంగ్స్ పెద్ద ఎత్తున ట్రోల్ కి గురవుతున్నాయి. సల్మాన్ ఖాతాలో లో మరో డిజాస్టర్ ఖాయమన్న మాట వినిపిస్తుంది. ఈ దశలో మరోసారి గురూజీ పూజాకు దేవుడయ్యాడు. ఆమెకు బ్రేక్ ఇచ్చే బాధ్యత తీసుకున్నాడు.
ఎస్ఎస్ఎంబీ 28లో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మీదే పూజా ఆశలన్నీ. ఇక తన ఫేవరెట్ హీరోయిన్ కోసం త్రివిక్రమ్ అద్భుతమైన పాత్ర రాశాడని తెలుస్తుంది. మహేష్ తో ఆమె కెమిస్ట్రీ సైతం అలరించనుందట. మహేష్ మూవీతో పూజాకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఆమె కెరీర్ ని నిలబెట్టాలని త్రివిక్రమ్ పట్టుదలగా ఉన్నారట. గత రెండు చిత్రాల అనుభవాల రీత్యా త్రివిక్రమ్ తన మాట నిలబెట్టుకుంటాడని పూజా కూడా విశ్వాసంతో ఉన్నదట.