మళ్శీ డైరెక్షన్ మొదలెట్టిన తరుణ్ భాస్కర్, ఏం సినిమా చేస్తున్నాడంటే..?

By Mahesh JujjuriFirst Published Nov 20, 2022, 4:15 PM IST
Highlights

ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ ముచ్చటగా మూడో సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. రెండే సినిమాలతో యూత్ ను ఆకట్టుకున్న తరుణ్.. మళ్లీ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో అలరించబోతున్నాడు. ఇంతకీ తరుణ్ మూడో సినిమా డీటేల్స్ ఏంటీ..? 

ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ ముచ్చటగా మూడో సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. రెండే సినిమాలతో యూత్ ను ఆకట్టుకున్న తరుణ్.. మళ్లీ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో అలరించబోతున్నాడు. ఇంతకీ తరుణ్ మూడో సినిమా డీటేల్స్ ఏంటీ..? 

మూసతో వెళ్తున్న సినిమాలకు కాస్త కొత్తదనం టచ్ ఇచ్చి.. అందరి దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. రెండే రెండు సినిమాలతో యూత్ ను తనవైపు తిప్పుకున్న ఈ యంగ్ స్టార్ డైరెక్టర్.. విజయ్ దేవరకొండను ముందుగా వెలుగులోకి తీసుకొచ్చాడు. అటువంటి దర్శకుడు రెగ్యూలర్ గా .. సినిమాలు చేసుకుంటూ వెళ్లకుండా.. సరదాగా లైఫ్ ను లీడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సినిమాలకు రైటర్ గా పనిచేయడమే కాకుండా.. కొన్ని సినిమాల్లో నటిస్తూ.. అటు హీరోగా కూడా మారిపోయాడు 

పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడంతో... చాలా కాలం డైరెక్షన్ కు దూరంగా ఉంటున్నాడు తరుణ్ భాస్కర్ .  నాలుగేళ్ల విరామం తర్వాత తరుణ్ ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టాబోతున్నాడు. ఇప్పటి వరకూ రెండు సినిమాలు చేసిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకు రెడీ అవుతున్నాడు. 

కీడా కోలా అనే డిఫరెంట్.. అండ్  వెరైటీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను  పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నాడు తరుణ్ భాస్కర్. పాన్ ఇండియాకు తన టాలెంట్ ను చూపించబోతున్నాడు. ఆగస్ట్‌లోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేశాడు తరుణ్ భాస్కర్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి సమాచారం ఇచ్చాడు.  కూల్ డ్రింక్ క్యాప్‌ కింద బొద్దింకను చూపిస్తూ డిఫరెంట్ పోస్టర్‌‌తో ఈ విషయం ప్రకటించాడు తరుణ్ భాస్కర్. అయితే ఇందులో ఎవరు నటిస్తున్నారన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. 

త్వరలో అఫీషియల్ గా ఎవరు నటిస్తున్నది తెలిపే అవకాశం ఉంది.  భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది  ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు తరుణ్ భాస్కర్ ప్రకటించాడు.

click me!